Home » KTR
హైదరాబాద్: వికారాబాద్ జిల్లా, కొడంగల్ లగచర్ల దాడి పథకం ప్రకారమే జరిగిందని.. బయట గ్రామం నుంచి వచ్చి దాడులకు పాల్పడినట్టు ఐజీ సత్యనారాయణ వెల్లడించారు. పట్నం నరేందర్‌రెడ్డి సెల్‌ఫోన్‌ను పోలీసులు సీజ్ చేశారు. ఫోన్ ఓపెన్ చేసేందుకు మెజిస్ట్రేట్ అనుమతి కోరారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్.. సోషల్ మీడియా వేదికగా రెచ్చిపోయారు. సీఎం రేవంత్‌పై ఘాటైన వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. ఎవనిదిరా కుట్ర? అంటూ పరుష పదజాలంతో చెలరేగిపోయారు.
కొడంగల్ పరిధిలోని రైతుల భూములను లాక్కునే ప్రయత్నంలో భాగంగానే సీఎం రేవంత్‌రెడ్డి అక్కడి ప్రజల్లో అశాంతి రగిలిస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు.
లగచర్లలో కలెక్టర్, అధికారులపై దాడి బీఆర్ఎస్ కుట్రేనని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. ముందస్తు ప్రణాళిక ప్రకారం అరాచక శక్తుల ద్వారా అమాయకులైన దళిత, గిరిజన రైతులను రెచ్చగొట్టి దాడి చేయించారని ధ్వజమెత్తారు.
లగచర్ల ఫార్మా విలేజ్ దాడి కేసు కీలక మలుపు తిరిగింది. ఈ దాడితో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ప్రమేయముందని పోలీసులు తేల్చారు. అంతేకాదు.. ఘటనకు ముందు.. ఆ తర్వాత కేటీఆర్‌తో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి ఫోన్లో మాట్లాడిన ఆడియో రికార్డును, ఇతర సాంకేతిక ఆధారాలను పోలీసులు సేకరించారు.
Telangana: కొడంగల్ నియోజకవర్గం లగచర్ల గ్రామం ఘర్షణల వ్యవహారంలో మాజీ ఎమ్మెల్యే పట్నం మహేందర్ రెడ్డికి 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. అయితే, ఈ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. పోలీసుల రిమాండ్ రిపోర్ట్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేరును..
Telangana: ‘‘వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్‌కు సురేష్ పద్ధతిగా.. మర్యాదగా చెప్తే తప్పా. సొంత పార్టీ కార్యకర్తలతో మా నేతలు మాట్లాడితే తప్పా. సురేష్ మమల్ని కలవటం తప్పు అయితే.. రాహుల్ గాంధీ రోజూ తిట్టే అదానీని రేవంత్ కలవటం కూడా తప్పే. హైకోర్టులో పిటిషన్లు వేసి ప్రభుత్వం జడ్జిలను కూడా తప్పుదోవ పట్టిస్తుంది. ఇది ఇందిరమ్మ రాజ్యం కాదు.. ఇందిరా గాంధీ ఎమర్జన్సీ పాలన’’ అంటూ కేటీఆర్ ఫైర్ అయ్యారు.
సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి పదవులు త్వరలో ఊడిపోవడం ఖాయమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
గవర్నర్ నుంచి అనుమతి రాగానే ఈ రేసు స్కాంలో చర్యలు ఉంటాయని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఒకప్పుడు బీజేపీని విమర్శించిన కేటీఆర్, ఇప్పుడు ఢిల్లీలో ఆ పార్టీ నేతలను కలుస్తున్నారని గుర్తుచేశారు. అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు ఢిల్లీ వచ్చారని తెలిపారు.
Telangana: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఢిల్లీ వేదికగా మాజీమంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు. అమృత్ పథకం అవినీతిపై కేంద్రానికి కేటీఆర్ ఫిర్యాదు చేశారు. మంగళవారం కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మనోహర్ లాల్ కట్టర్‌ను కలిసిన కేటీఆర్.. ముఖ్యమంత్రిగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న రేవంత్ రెడ్డి పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు.