Home » Latest News
మిద్దె తోటలు పెచండంలో ప్రభుత్వం ప్రోత్సాహం కల్పిస్తుందని.. మహిళలు ముందుకు రావాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. కల్తీ ఆహారం పురుగు మందుల అవశేషాలున్న కూరగాయలు తిని మనిషి కష్టార్జితం అంతా హాస్పిటల్ పాలవుతుందని చెప్పారు.
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మినరసింహ స్వామి వారి ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. స్వామి వారిని దర్శించుకోడానికి ప్రముఖులు, భక్త జనం పోటెత్తారు. ఆదివారం సెలవు దినం కావడంతో స్వామి వారి దర్శనానికి భక్తులు బారులు తీరారు. లక్ష్మీనరసింహ స్వామి ధర్మ దర్శనానికి సుమారు 2 గంటల సమయం, ప్రత్యేక దర్శనానికి గంట సమయం పడుతోంది.
అన్నమయ్య జిల్లాకు ఎంతో ప్రాచీన చరిత్ర, సంస్కృతి ఉన్నాయనడానికి ఈ రాతి నిర్మాణాలే నిదర్శనం. దేవవాండ్లప ల్లెకు ఉత్తర దిశలో దాదాపు మూడు కిలోమీటర్ల దూరంలోని శేషాచల కొండల్లోని ఎర్రకొండల్లో ఈ నిర్మాణాలు ఉన్నాయి.
సౌర విద్యుత్ ప్రాజెక్టు ముడుపుల కేసులో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మెడకు ఉచ్చు బిగుసుకునే అవకాశం కనిపిస్తోంది. జగన్ను ప్రాసిక్యూట్ చేసే అవకాశాలను రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా తెచ్చిన చట్టం వల్ల భూములు కబ్జా చేసేవారికి కఠిన శిక్షలు పడతాయని తెలుగుదేశం పార్టీ పేర్కొంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో విచ్చలవిడిగా పెరిగిపోయిన భూ కబ్జాదారుల దుర్మార్గాలను అడ్డుకోవడానికే కొత్త చట్టం వచ్చిందని ఆ పార్టీ వ్యాఖ్యానించింది.
ప్రాథమిక రాతపరీక్షలో కనీస అర్హత మార్కులు సాధించని హోంగార్డు అభ్యర్థులకు నోటిఫికేషన్ను ప్రశ్నించే హక్కు ఉండదని, వారి విషయంలో ఇచ్చిన...
రాష్ట్రవ్యాప్తంగా పాఠశాల వ్యవస్థ ధ్వంసమైన పరిస్థితి కనిపిస్తోందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. కుమ్రంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో కలుషిత
కాలుష్యాన్ని తగ్గించడంలో భాగంగా ఈవీ(ఎలక్ట్రిక్ వాహనాలు)ల రిజిస్ట్రేషన్లో ప్రభుత్వం రాయితీలు ఇస్తున్న విషయం ప్రజలకు చేరువవ్వాలని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించింది.
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక సర్వేకు పైలట్ ప్రాజెక్ట్ జిల్లాలుగా మెదక్, నిజామాబాద్, మహబూబ్నగర్, భద్రాద్రి కొత్తగూడెం ఎంపికయ్యాయి. సర్వే ఆధారంగా లబ్ధిదారుల వివరాలను ‘ఇందిరమ్మ’ యాప్లో నమోదు చేయనున్నట్లు మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ శనివారం తెలిపారు.
భూ దురాక్రమణలు, వైసీపీ నేతల అరాచకాలపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. శనివారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏపీ హౌసింగ్ బోర్డు చైర్మన్ బత్తుల తాతయ్యబాబు, మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ వినతులు స్వీకరించారు.