Home » Latest News
వైసీపీ అధికారంలో ఉండగా ఫైబర్‌నెట్ కార్పొరేషన్లో అవినీతి జరిగిందంటూ అప్పటి ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడుపై నమోదు చేసిన సీఐడీ కేసును విజయవాడ ఏసీబీ కోర్టు కొట్టివేసింది. ఈ కేసులో ఆయనతోపాటు మిగిలిన నిందితులకు క్లీన్చిట్ ఇచ్చింది.
ఐ బొమ్మ రవి కస్టడీకి ఎక్కువ సమయం ఇవ్వాలని నాంపల్లి కోర్టులో సైబర్ క్రైమ్ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌పై శుక్రవరం విచారణ జరిగింది.
ఉత్తరాది నుంచి వీస్తున్న గాలులతో చలి తీవ్రత బాగా పెరిగింది. ఈ నేపథ్యంలో పలు జిల్లాల్లో చలి తీవ్రత మరింత పెరగనుంది. దాంతో వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన ఖరారైంది. రెండు రోజుల పాటు ఆయన ఢిల్లీలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలువురు కీలక నేతలతోపాటు కేంద్ర మంత్రులతో ఆయన సమావేశం కానున్నారని తెలుస్తోంది.
అస్సాం సాంస్కృతిక ఐకాన్, ప్రముఖ సింగర్, మ్యూజిక్ డైరెక్టర్ జుబీన్ గార్గ్ ఇటీవల సింగపూర్ లో కన్నుమూశారు. ఓ ఈవెంట్ లో ప్రదర్శన ఇవ్వడానికి వెళ్లినప్పుడు ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. అయితే..
కాంగ్రెస్ పార్టీ హత్యా రాజకీయాలకు పాల్పడినా మొక్కవోని ధైర్యంతో అధికార పార్టీ అరాచక పర్వాన్ని ఎదుర్కొన్నారని పార్టీ శ్రేణులకు కేటీఆర్ ప్రశంసించారు. ఈ సందర్భంగా గులాబీ సైనికులందరికీ ఆయన ప్రత్యేకంగా అభినందనలు చెప్పారు.
అఖండ-2 చిత్ర నిర్మాతలకు తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ ఊరట ఇచ్చింది. గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులపై డిసెంబర్ 14వ తేదీ వరకు డివిజన్ బెంచ్ స్టే విధించింది.
విశాఖపట్నంలోని కాగ్నిజెంట్ సంస్థలో 25 వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని సీఈవో రవి కుమార్ వెల్లడించారు. ముందుగా 8 వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని ఒప్పందం చేసుకున్నట్లు ఆయన తెలిపారు.
భవిష్యత్‌లో తాను సీఎం అయితే బీఆర్ఎస్ పార్టీపై విచారణ చేపడతానన్నారు. 2014 నుంచి జరిగిన అన్ని అన్యాయాలపై విచారణ చేయిస్తానని చెప్పారు. ప్రతి ఒక్కరికి టైం వస్తుందని.. తనకు ఎప్పుడో ఒకసారి వస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.
మీరు డిప్రెషన్‌తో బాధపడుతున్నారా? రోజూ ఒక నారింజ పండు తినడం లేదా దాని రసం తాగడం వల్ల మానసిక స్థితి మెరుగుపడుతుందని, నిరాశ తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.