Home » Liquor rates
మద్యం దుకాణాల ఏర్పాటుకు సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ ముగిసింది. మొత్తం రెండు లక్షల దరఖాస్తులు.. ఫీజు కింద రెండు వేల కోట్ల రూపాయలు వస్తాయని అధికారులు భావించారు. అయితే, కొన్నిచోట్ల సిండికేట్లు ప్రభావం చూపించడంతో అంచనా కంటే కొంత తగ్గువగా దరఖాస్తులు వచ్చాయి.
ఎన్టీఆర్ జిల్లాలో మొత్తం 113 మద్యం షాపుల కోసం 4,839 దరఖాస్తుల దాఖలు చేశారు. ఇక అల్లూరి జిల్లాలో అత్యల్పంగా దరఖాస్తులు వచ్చాయి. ఈ జిల్లాలో మొత్తం 40 మద్యం దుకాణాలున్నాయి. వాటికి కేవలం 869 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. మరోవైపు నేటి రాత్రి వరకు గడువు ముగియనుంది. దీంతో ఈరోజు మరో 20 వేల దరఖాస్తులు దాఖలవుతాయని అబ్కారీ శాఖ ఉన్నతాధికారులు అంచనా వేస్తున్నారు.
కొత్త మద్యం పాలసీలో రౌండాఫ్ పేరుతో అదనపు పన్నులు విధించాలని ఎక్సైజ్ శాఖ నిర్ణయించింది. మద్యం సీసాల ధరల్లో రౌండాఫ్ విధానంపై స్పష్టతనిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.
మద్యం పాలసీ అమలులోకి రాకముందే దరఖాస్తు రుసుము రూపేణా ప్రభుత్వానికి భారీగా ఆదాయం వచ్చింది. రాష్ట్రంలోని 3,396 షాపులకు గురువారం సాయంత్రానికి 65,629 దరఖాస్తులు వచ్చాయి.
‘ఐదారు రోజుల్లో ప్రైవేటు షాపులు వచ్చేస్తున్నాయి. మన ఉద్యోగాలు ఊడిపోతాయి. దొరికినకాడికి దోచేయడమే ఇప్పుడు మన పని’.. అని అనుకుంటున్నారు ప్రభుత్వ మద్యం షాపుల సిబ్బంది.
ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మద్యం టెండర్ల షెడ్యూల్లో మార్పులు చేసే అవకాశమున్నట్లు సమాచారం. ఈ నెల11వ తేదీ సాయంత్రం 5 గంటలకు వరకు దరఖాస్తులకు అవకాశం కల్పించనున్నట్లు తెలియవచ్చింది. ఈ నెల 14వ తేదీన అధికారులు మద్యం షాపులకు లాటరీ తీయనున్నారు. 16వ తేదీ నుంచి కొత్త మద్యం విధానం అమలు కానుంది.
ఆంధ్రప్రదేశ్లో మద్యం షాపుల కోసం జారీచేసిన లాటరీ వ్యవహారం కాక రేపుతోంది. లాటరీ విషయంలో ఎమ్మెల్యేలు జోక్యం చేసుకుంటారని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వరస కథనాలు రాసింది. ఆ విషయం అధికారుల ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలుసుకున్నారు.
నూతన మద్యం షాపుల నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా పరిధిలోని మూడు మున్సిపాలిటీలు, ఒక నగర పంచాయతీ, 22 మండలాల పరిధిలో 133 మద్యం షాపుల కేటాయింపునకు ఉత్తర్వులు జారీ చేసింది.
మద్యనిషేధం అమల్లో ఉన్న బిహార్లో పోలీసులు ఏకంగా పోలీ్సస్టేషన్లోనే మందు పార్టీ చేసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్లో గత వైసీపీ ప్రభుత్వం మద్యం విధానాన్ని అస్తవ్యస్తం చేసిందని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. సొంత ఆదాయం పెంచుకునేలా మద్యం పాలసీ తీసుకొచ్చి ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టారని మాజీ ముఖ్యమంత్రి జగన్పై కొల్లు రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.