Home » Lok Sabha
2027 మార్చి 31నాటికి దేశవ్యాప్తంగా 25,000 జన ఔషధి కేంద్రాలు ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ తెలిపారు. ఈ ఏడాది జూన్ నెలాఖరు నాటికి దేశవ్యాప్తంగా 12,616 కేంద్రాలు నెలకొల్పినట్లు ఆమె వెల్లడించారు.
ఎడ తెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వివిధ ప్రాంతాల్లో కొండ చరియలు విరిగి పడ్డాయి. ఆ ప్రమాదంలో దాదాపు 160 మందికిపైగా మరణించారు. అలాగే వందలాది మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ నేపథ్యంలో లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతోపాటు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ గురువారం కేరళలోని వయనాడ్, ముప్పడిలో పర్యటించనున్నారు.
దేశంలో మహిళల భద్రత కోసం వివిధ పథకాలు, కార్యక్రమాల కింద కేంద్ర ప్రభుత్వం రూ.13,412కోట్లు ఖర్చు చేస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ లోక్ సభలో వెల్లడించారు. మహిళా భద్రతా పథకాల కింద మహిళలు, పిల్లలపై లైంగిక వేధింపుల కేసులను నిర్వహించే పరిశోధకులతోపాటు ప్రాసిక్యూటర్ల సామర్థ్యం పెంపొందించేందుకు శిక్షణ ఇచ్చే నిబంధన ఉందా?, ఏయే కార్యక్రమాలు అమలు చేస్తున్నారంటూ ఎంపీ నీరజ్ శేఖర్ అడిగిన ప్రశ్నకు బండి సంజయ్ బదులిచ్చారు.
కేరళలో ప్రకృతి సృష్టించిన బీభత్సంతో భారీగా కొండ చరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో మృతి చెందిన వారి సంఖ్య అంతకంతకు పెరుగుతుంది. బుధవారం ఉదయానికి మృతుల సంఖ్య 156కి చేరింది. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశముందని ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. ఇక గాయపడిన 130 మంది వయనాడ్లోని పలు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
తిరుపతి జిల్లా వరకే చూస్తే గడచిన ఐదేళ్ళలో ఏకంగా 3746 మంది బాలికలు, యువతులు, మహిళలు అదృశ్యమయ్యారు.
ఈనెల 23న పార్లమెంటులో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ లో విపక్ష పాలిత రాష్ట్రాలపై నిర్లక్ష్యం చూపారంటూ ప్రతిపక్షాలు చేసిన ఆరోపణలను ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తోసిపుచ్చారు. ఏ రాష్ట్రానికి కూడా నిధులు నిరాకరించలేదని చెప్పారు.
జమ్మూకశ్మీర్లో ఈ ఏడాది జూలై 21 వరకూ 11 ఉగ్రదాడుల ఘటనలు, 24 ఎన్కౌంటర్లు చోటుచేసుకున్నాయని, భద్రతా సిబ్బంది, పౌరులు సహా 28 మంది మృతి చెందారని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ మంగళవారంనాడు లోక్సభలో తెలిపింది.
కేరళలోని వయనాడ్లో కొండచరియలు విరిగిపడి భారీగా ప్రాణనష్టం జరగడంతో కేంద్ర ప్రభుత్వం అన్నివిధాలా ఆదుకోవాలని వయనాడ్ మాజీ ఎంపీ, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కోరారు. ప్రకృతి వైపరీత్యంలో బాధితులకు తక్షణ పరిహారం విడుదల చేయాలని కేంద్రాన్ని కోరారు.
ఉన్నత విద్య కోసం భారతీయ విద్యార్థులు విదేశాలకు పయనమవుతున్న వారి సంఖ్య రోజురోజుకు ఇబ్బడిముబ్బడిగా పెరుగుతోంది. అయితే అలా ఉన్నత విద్య కోసం వివిధ విదేశాలకు వెళ్లిన భారతీయ విద్యార్థుల్లో పలువురు వివిధ కారణాల వల్ల మృత్యువాత పడుతున్నారు.
PM Modi and His Government Jointly Built the 'Modern Padma Vyuha', Held People Captive and Created an Atmosphere of Terror in Country.