Home » Madakasira
ప్రభుత్వం భూ సమస్యలు పరిష్కారం కోసం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెవెన్యూ సదస్సులు నీరుగారుతున్నాయి. కొందరు అధికారలు సదస్సులకు డుమ్మా కొడుతుండటంతో ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ప్రజా సమస్యలపై అధికారులు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని ఎమ్మెల్యే, టీటీడీ బోర్డు సభ్యుడు ఎంఎస్ రాజు హెచ్చరించారు. గురువారం ఆర్అండ్బీ అతిథిగృహంలో మడకశిర నగర పంచాయతీ ఉద్యోగులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
రబీ సీజనలో రైతులు బోరు బావుల కింద రాగిపంట సాగు చేయడం ద్వారా ఆర్థికంగా అభివృద్ధి చెందవచ్చని జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ అన్నారు. గురువారం మండలంలోని మోరుబాగల్ గ్రామంలో రాగి పంట సాగుపై రైతులతో సమావేశం నిర్వహించారు.
మడకశిర మండల పరిధిలోని ఆమిదాలగొంది జిల్లా పరిషత ఉన్నత పాఠశాలలో 8వతరగతి చదువుతున్న విద్యార్థి చేతన హత్య ఘటనపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆరా తీశారు. అసలు ఏం జరిగింది అంటూ అధికారుల నుంచి సమాచారం తెలుసుకొన్నారు.
పావగడ, తుమకూరు, చిక్కబళ్లాపుర, బెంగళూరు, అనంతపురం తదితర ప్రాంతాల్లో ద్విచక్రవాహనాలను దొంగలించి పోలీసులకు సవాలుగా మారిన ముగ్గురు అంతర్రాష్ట్ర దొంగలను పావగడ పోలీసులు అరెస్టు చేశారు.
భార్యపై అనుమానంతో కన్నబిడ్డ అని కూడా చూడకుండా ఆరు నెలల పసికందును గొంతు నులిమి అమానుషంగా చంపేశాడు. తోటలో పాతిపెట్టి పరారయ్యాడు. కర్ణాటకలోని మారుమూల ప్రాంతానికి చేరాడు. పేరు మార్చుకున్నాడు.
మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజుకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు సభ్యుడిగా అవకాశం దక్కింది. ఈ మేరకు బుధవారం టీటీడీ బోర్డు కార్యవర్గాన్ని ప్రభుత్వం ప్రకటించింది. చైర్మనతోపాటు 23 మందికి సభ్యులుగా అవకాశం కల్పించారు.
ఇటీవల కురిసిన వర్షాలకు ఆర్అండ్బీ పరిధిలో దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులకు రూ.6 కోట్లతో ప్రతిపాదనలు పంపినట్లు ఆర్అండ్బీ డీఈ జగదీష్ గుప్తా, ఏఈ నరసింహమూర్తి తెలిపారు.
ముఖ్యమంత్రి చంద్రబాబుతోనే పేదలకు సంక్షేమ ఫలాలు అందుతాయని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుండుమల తిప్పేస్వామి అన్నారు.
మడకశిర డిపోను అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే ఎంఎస్ రాజు అన్నారు. మడకశిర డిపో నుంచి ఉదయం 5 గంటలకు వెళ్లే కర్నూలు సర్వీ్సకు కొత్త బస్సును టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుండుమల తిప్పేస్వామితో కలిసి ఎమ్మెల్యే అమరాపురం బస్టాండులో జెండా ఊపి గురువారం ప్రారంభించారు.