Home » Madhya Pradesh
మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌కు చెందిన షబ్బీర్ అనే వ్యక్తి ``పుష్ప 2`` సినిమా చూసేందుకు ఆదివారం నాడు ఇందర్‌గంజ్ ప్రాంతంలోని కైలాష్ టాకీస్‌కు వెళ్లాడు. ఇంటర్వెల్ సమయంలో స్నాక్స్ కొన్నాడు. అయితే ఆ స్నాక్స్ బిల్లు విషయంలో షబ్బీర్‌కు, క్యాంటిన్ ఓనర్ రాజుకు మధ్య వాగ్వాదం మొదలైంది.
పులి కంట పడిన జంతువైనా, మనిషి అయినా తప్పించుకోవడం దాదాపు అసాధ్యం. ఒక్కసారిగా దాని కంటపడగానే వెతికి వెతికి మరీ వేటాడుతుంది. అయితే కొన్నిసార్లు కొన్ని జంతువులు పులి నోటిదాకా వెళ్లి అదృష్టవశాత్తు తప్పించుకుంటుంటాయి. అలాగే మనుషులు కూడా పులులు కళ్లగప్పి ప్రాణాలతో బయటపడుతుంటారు. ఇలాంటి ..
తల్లి కళ్లల్లో ఆనందం కోసం నకిలీ పోలీసు అవతారం ఎత్తిన ఓ యువతిపై తాజాగా కేసు నమోదైంది. మధ్యప్రదేశ్‌లోని భోపాల్ నగరంలో శుక్రవారం ఈ ఘటన వెలుగు చూసింది.
గ్వాలియర్‌లోని హజీరా జాతీ లైన్ ప్రాంతానికి చెందిన భవిష్య(14) అనే బాలుడు స్థానిక బీటీఐ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. అయితే ఆదివారం మధ్యాహ్నం పాఠశాల అనంతరం తన స్నేహితుడిని ఇంటి వద్ద దింపేందుకు భవిష్య నిర్ణయించుకున్నాడు. అనంతరం ఇద్దరూ కలిసి సైకిల్‌పై ఏఆర్పీ కాలనీకి బయలుదేరారు.
‘నాకు ఉద్యోగం వచ్చే వరకు నీవు కూడా జాబ్ చేయడానికి వీల్లేదు. చేస్తున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాన్ని మానేసెయ్’ అంటూ భార్యపై ఒత్తిడి తెచ్చిన భర్తపై మధ్యప్రదేశ్ హైకోర్టు కఠినంగా వ్యవహరించింది.
వితంతువైన కోడలికి ఆమె మామ ఎలాంటి భరణం చెల్లించాల్సిన పనిలేదని మధ్యప్రదేశ్ హైకోర్టు స్పష్టం చేసింది.
కొందరు వ్యక్తులు ఒక్కోసారి భలే విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉంటారు. చాలా చిన్న విషయాలకు కోపం తెచ్చుకుంటారు. చిన్న విషయాలను పట్టించుకుని పెద్దదిగా చేసుకుంటారు. ఆ తర్వాత పశ్చాత్తాపం చెందుతారు. తాజాగా మధ్యప్రదేశ్‌లో ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది.
పెట్రోల్ పంపులు, గ్యాస్ రీఫిల్లింగ్ స్టేషన్లు, సూపర్ మార్కెట్ల వంటి ప్రదేశాలలో నగదు లావాదేవీలను నిలిపివేయనున్నట్లు పోలీసులు ప్రకటించారు. కొత్త సంవత్సరం నుంచి ఈ రూల్స్ అమల్లోకి రానున్నాయి. అయితే ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
ఆమె 5 నెలల గర్భవతి.. భర్త చనిపోవడంతో పట్టరాని దుఃఖంలో ఉంది. భర్త శవం ఉన్న హాస్పిటల్లోనే ఆమె ఉంది. అయితే మాత్రం మాకేంటి? ఆసుపత్రి బెడ్‌కు అంటిన రక్తం మరకలు తుడవాల్సిందే.. అంటూ హాస్పిటల్ సిబ్బంది అమానుషంగా ప్రవర్తించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
మధ్యప్రదేశ్‌లో వరుస దారుణాలు చోటు చేసుకున్నాయి. ఇద్దరు మహిళలపై వేర్వేరుగా లైంగిక దాడి జరిగింది. రేవాలో పిక్నిక్ వెళ్లిన దంపతులపై దాడి చేశారు. భర్తను చెట్టుకు కట్టేసి.. భార్యపై లైంగిక దాడి చేశారు.