Home » Mahabubabad
తెలుగు రాష్ట్రాల రాజకీయాలను శాసించే శక్తి ఒక్క మున్నూరు కాపులకే ఉందని ఆంధ్రప్రదేశ్ భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు.
కేసముద్రం స్టేషన్‌లోని ఉప్పరపల్లి రోడ్లో ఆదివారం బత్తుల అనూష(30)ను ఆమె భర్త ఉరి వేసి చంపి, ఆత్మహత్య చేసుకున్నట్లుగా చిత్రీకరించినట్లు రూరల్ సీఐ సర్వయ్య తెలిపారు.
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేసేందుకే బీఆర్ఎస్ నేతలు కుట్రలు చేస్తున్నారని మంత్రి సీతక్క ఆరోపించారు. ప్రభుత్వ హాస్టళ్లలో ఫుజ్ పాయిజనింగ్ ఘటనల్లో వారి కుట్ర ఉందని సీతక్క ఆరోపించారు.
రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో పెకిలించే వరకూ తాము పోరాడతామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు.ఫార్మా విలేజీ కోసం 3వేల ఎకరాలు సేకరిస్తామంటే లగచర్ల రైతులు నిరసనకు దిగారని చెప్పారు. 9నెలలుగా వారు నిరసన చేస్తున్నా సీఎం రేవంత్‌రెడ్డి ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు.
మహబూబాబాద్‌లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం గిరిజన రైతు మహా ధర్నా జరగనుంది. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాకను నిరసిస్తూ లంబాడి హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో బాబు నాయక్ తండా గిరిజనులు నిరసన చేపట్టారు. వైద్య కళాశాల కోసం తమ భూములను బీఆర్ఎస్ ప్రభుత్వం లాక్కుందని.. కేటీఆర్‌కు మహబూబాబాద్‌కు వచ్చే అర్హత లేదని.. కేటీఆర్ గో బ్యాక్... గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో గిరిజన, దళితులు, రైతులపై జరుగుతున్న దాడులకు నిరసనగా బీఆర్ఎస్ మహబూబాబాద్‌లో దర్నాకు పిలుపిచ్చింది. అయితే ఈ ధర్నాకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో హైకోర్టును ఆశ్రయించింది. షరతులతో కూడిన దర్నాకు అనుమతినిచ్చింది. దీంతో సోమవారం మహబూబాబాద్‌లో బీఆర్ఎస్ ధర్నా నిర్వహిస్తుంది.
మహబూబాబాద్‌లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తలపెట్టిన ధర్నాకు అనుమతి ఇవ్వాలని పోలీసు అధికారులకు హైకోర్టు ఆదేశాలు జారీచేసింది.
కాాంగ్రెస్ ప్రభుత్వం భూకబ్జాలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటుంది. భూములును ఆక్రమించిన వారిపై రేవంత్ ప్రభుత్వం సీరియస్‌గా ఉంది. ఫిర్యాదు దారుల నుంచి వచ్చిన వినతులను త్వరగా పరిష్కరించేలా చర్యలు చేపట్టింది.
లగచర్ల ఘటనపై రాష్ట్రపతి కార్యాలయం ఆరా తీసినట్టు సమాచారం. దాడికి సంబంధించిన వివరాలను ఇవ్వాలని రాష్ట్రపతి కార్యాలయం బీఆర్ఎస్ను కోరినట్టు తెలిసింది. ఫార్మా విలేజ్‌కు భూసేకరణ విషయంలో లగచర్ల గ్రామస్థులపై పోలీసులు ప్రవర్తించిన తీరును, వార్త కథనాలను రాష్ట్రపతి కార్యాలయానికి బీఆర్ఎస్ అందించినట్టు సమాచారం.
మహబూబాబాద్ జిల్లాలో నాసిరకం విత్తనాల వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకొచ్చింది.