Home » Maharashtra
సమాజ్ వాదీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతున్నారని, కానీ కొన్ని సార్లు ఆ పార్టీ రాష్ట్ర విభాగం మాత్రం బీజేపీ బీ టీమ్‌లా వ్యవహరిస్తోందని ఆదిత్య థాకరే తప్పు పట్టారు.
మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌ను విపక్ష 'మహా వికాస్ అఘాడి' నేతలు ఆదివారంనాడు కలిసారు. ఎంవీఏ ప్రతినిధులు బృందానికి శివసేన (యూబీటీ) నేత భాస్కర్ జాదవ్ నాయకత్వం వహించారు.
స్పీకర్ ఎన్నికలో భాగంగా రాహుల్ నార్వేకర్ సోమవారంనాడు తన నామినేషన్ పత్రాన్ని రిటర్నింగ్ అధికారికి అందజేశారు. ఆయన వెంట ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, ఉప ముఖ్యమంత్రులు ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ బవాంకులే, చంద్రకాంత్ పాటిల్ తదితరులు నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు.
అమెరికా, ఇగ్లాండ్, పలు యూరోపియన్ దేశాల్లో ఎన్నికలను ఈవీఎంల ద్వారా కాకుండా బ్యాలెట్ ద్వారా నిర్వహిస్తున్నప్పుడు, యావత్ ప్రపంచం బ్యాలెట్ ద్వారా ఎన్నికలు జరుపుతున్నప్పుడు మనం ఎందుకు ఆ విధంగా చేయకూడదని శరద్ పవార్ ప్రశ్నించారు.
పలు రాష్ట్రాల్లో ఉచిత పథకాల ధోరణిపై ఆర్థిక శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. ఇది క్రమంగా రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతోందని తెలిపింది. అయితే ఎందుకు దీని ప్రస్తావన వచ్చిందనే వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.
కొల్హాపూర్‌లో శనివారంనాడు జరిగిన మీడియా సమావేశంలో పవార్ మాట్లాడుతూ, ఫలితాల అనంతరం ప్రజల్లో ఆనందం కనిపించడం లేదని అన్నారు. విపక్షాలు దీనిపై ఎంతమాత్రం ఆందోళన పడాల్సిన అవసరం లేదని, ప్రజల్లోకి వెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పారు.
మహారాష్ట్రలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో 48 స్థానాల్లో ఎంవీఏ 30 సీట్లు గెలుచుకోగా, నవంబర్ 20న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలోని 288 స్థానాలకు కేవలం 49 స్థానాలను మాత్రమే గెలుచుకుంది.
బీజేపీ సీనియర్ ఎమ్మెల్యే కాళిదాస్ కొలాంబ్కర్‌ను ప్రోటెం స్పీకర్‌గా గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ శుక్రవారంనాడు నియమించారు. తక్కిన 287 మంది ఎమ్మెల్యేలతో ఆయన ప్రమాణస్వీకారం చేయిస్తారు. డిసెంబర్ 9న అసెంబ్లీ స్పీకర్ ఎన్నిక జరుగుతుంది.
మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ముంబైలోని ఆజాద్ మైదాన్‌లో సాయంత్రం 5:30 గంటలకు ప్రమాణ స్వీకారోత్సవం జరగనుంది. అయితే హోమంత్రి పదవి ఎవరికి దక్కుతుందనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
కొత్త ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవిస్‌కు మద్దతిస్తున్నట్టు గవర్నర్‌కు లేఖలు ఇచ్చిన ఏక్నాథ్ షిండే, అజితి పవార్ ఆ వెంటనే ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఒకరిపై మరొకరు 'పంచ్'లు విసురుకున్నారు. దీంతో ఒక్కసారిగా వాతావరణం ఆహ్లాదకరంగా మారింది.