Home » Maharashtra
ముంబైని లూటీ చేయడానికి గుజరాత్ నుంచి ఇద్దరు వ్యక్తులు వచ్చారని తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి ఆరోపించారు. వారే ‘ప్రధాని, అదానీ’ అని చెప్పారు.
జార్ఖాండ్, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు, ఉప ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్లు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినట్టు నవంబర్ 11న బీజేపీ ఫిర్యాదు చేసినట్టు ఖర్గేకు రాసిన లేఖలో ఈసీ తెలిపింది. ఇదే తరహాలో నడ్డాకు కూడా ఈసీ లేఖ రాసింది.
మహారాష్ట్రలో ఇటీవల శివసేన (యూబీటీ) నేత ఉద్ధవ్ థాకరే బ్యాగులను ఈసీ అధికారులు పదేపదే తనిఖీ చేయడం, ఇందుకు సబంధించిన వీడియోను థాకరే విడుదల చేయడంతో వివాదం మొదలైంది. ప్రధానమంత్రి, బీజేపీ నేతలు పర్యటనకు వచ్చినప్పుడు కూడా ఇదే తరహా తనిఖీలు చేస్తారా అని థాకరే నిలదీశారు.
ఉత్తరాది రాజకీయాలు, దక్షిణాది రాజకీయాలు భిన్నంగా ఉంటాయని, మహారాష్ట్ర ఎన్నికలు పూర్తిగా భిన్నమైనవని అజిత్ పవార్ చెప్పారు. 1985 నుంచి మహారాష్ట్రలో ఓ ఒక్క పార్టీ సంపూర్ణ మెజారిటీ సాధించలేదని, ఈసారి కూడా ఇదే పరిస్థితి ఉంటుందని అన్నారు. మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఎవరో ఒకరి సహాయం తీసుకోక తప్పదని అన్నారు.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కీలక సమయంలో అధికార ‘మహాయుతి’ కూటమిలో లుకలుకలు పెరుగుతున్నాయి. మహాయుతి కూటమి పక్షాన ఇటీవల ప్రచారం చేసిన యూపీ సీఎం, బీజేపీ నేత యోగి ఆదిత్యనాథ్.. హిందువులను ఉద్దేశించి ‘కటేంగోతో బటేంగే’(ఐక్యత లేకపోతే విభజిస్తారు) అని వ్యాఖ్యానించారు.
మహారాష్ట్ర! మన సరిహద్దు రాష్ట్రం.. ఆ రాష్ట్ర ఎన్నికల్లో తెలంగాణ మూలాలున్న వారు ప్రభావితం చేసే నియోజకవర్గాలు ఎన్నో...! దీంతో ఏఐసీసీ కూడా మహారాష్ట్ర ఎన్నికల్లో తెలంగాణ కాంగ్రెస్ నాయకులను పూర్తి స్థాయిలో వినియోగించుకుంటోంది.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 20వ తేదీన జరగనున్నాయి. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలు తమ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. అలాంటి వేళ..
లీడర్లు మతం పేరుతో అమాయక ప్రజలను రెచ్చగొడుతున్నారని.. వాళ్ల పిల్లలను మాత్రం విదేశాల్లో చదివిస్తున్నారని కాంగ్రెస్ లీడర్ మండిపడ్డారు.
శివసేన (యూబీటీ) అభ్యర్థి ఆదిత్య ఠాక్రేకు మద్దతుగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి బుధవారం ముంబైలోని వర్లీలో రోడ్షో నిర్వహించారు.
అయోధ్యలో రామాలయ నిర్మాణం జరక్కుండా కాంగ్రెస్ పార్టీ ఉద్దేశపూర్వకంగా ఏళ్ల తరబడి నిలిపేసిందని, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అయోధ్యలో రామాలయ నిర్మాణం, ఔరంగజేబ్ కూల్చేసిన కాశీ విశ్వనాథ ఆలయానికి కారిడార్ నిర్మించడం చేశారని గుర్తు చేశారు. ఇప్పుడు గుజరాత్లో స్వర్ణ సోమనాథ ఆలయాన్ని చూసేందుకు అందరూ సిద్ధంగా ఉండాలన్నారు.