Home » Maharashtra
డిసెంబర్ 4న బీజేపీ లెజిస్లేటివ్ పార్టీ సమావేశం ముంబైలో జరుగనుంది. ఇదే సమయంలో డిసెంబర్ 5న కొత్త ప్రభుత్వం ప్రమాణస్వీకారం చేస్తుందని బీజేపీ చీఫ్ చంద్రశేఖర్ బవాంకులే ప్రకటించారు.
ఫడ్నవిస్‌ను సీఎంగా నిర్ణయించే విషయంలో షిండేకు ఎలాంటి కోపం లేదని కూడా సుధీర్ ముంగటివార్ అన్నారు. ఒక శాఖకు సంబంధించి సొంత డిమాండ్లు ఉంటే దాని అర్ధం కోపంగా ఉన్నట్టు కాదని, షిండేకు తగిన గౌరవం ఉంటుందని చెప్పారు.
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పదవి రేసులో తాను లేనని, దీనిపై వస్తున్న వదంతులన్నీ నిరాధారమని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే తనయుడు శ్రీధర్ షిండే సోమవారంనాడు వివరణ ఇచ్చిన నేపథ్యంలో బీజేపీ లెజిస్లేచర్ పార్టీ నేత ఎంపికపై కేంద్ర పరిశీలను పార్టీ అధిష్ఠానం నియమించింది.
లోక్‌సభ ఎన్నికల తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వంలో మంత్రి పదవికి తనకు అవకాశం వచ్చిందని, పార్టీ ఆర్గనైజేషన్ కోసం పనిచేసే ఆలోచనతో మంత్రి పదవిని నిరాకరించానని శ్రీకాంత్ షిండే తెలిపారు. ప్రభుత్వంలో పొజిషన్ కావాలనే కోరిక తనకు లేదన్నారు.
ప్రతి భారతీయ కుటుంబం కనీసం ముగ్గురేసి పిల్లలను కనాలని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎ్‌సఎస్) చీఫ్ మోహన్ భాగవత్ పిలుపిచ్చారు.
పార్టీ అధినాయకత్వానికి ఇప్పటికే తాను బేషరతుగా మద్దతు ప్రకటించారని, వారి నిర్ణయానికి కట్టుబడి ఉంటానని ఏక్నాథ్ షిండే తెలిపారు. గత 2.5 సంవత్సరాల్లో తమ ప్రభుత్వం పనితీరు చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించ వచ్చన్నారు. ఆ కారణంగానే ప్రజలు చారిత్రక తీర్పునిచ్చారని చెప్పారు.
జనాభా తగ్గడంతో పలు సమాజాలు, భాషలు ఇప్పటికే ఉనికి కోల్పోయాయని మోహన్ భగవత్ హెచ్చరించారు. 1998 లేదా 2002లో భారత జనాభా విధానం రూపొందిందని, 2.1 శాతానికి కంటే సంతోనోత్పత్తి పడిపోకుండా చూడాల్సిన అవసరాన్ని కూడా గుర్తించిందని చెప్పారు.
మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు, క్యాబినెట్ పదవుల్లో వాటాపై ఢిల్లీలో కేంద్ర నేతలతో ఇటీవల సమావేశమైన షిండే ఆ తర్వాత ముంబై చేరుకున్నారు. అనంతరం కీలక సమావేశాలను రద్దు చేసుకుని మూడ్రోజుల కిత్రం తన స్వగ్రామానికి ఆయన వెళ్లిపోయారు.
మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా బీజేపీ నేతే అవుతారని ఎన్సీపీ అధ్యక్షుడు అజిత్ పవార్ చెప్పారు.
ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా నిర్ణయానికి కట్టుబడి ఉంటామని ఏక్నాథ్ షిండే ఇప్పటికే ప్రకటించారు. మరోవైపు గురువారం రాత్రి దేశ రాజధాని న్యూఢిల్లీలో అమిత్ షాతో అజిత్ పవార్, ఫడ్నవీస్ సమావేశమై.. రాష్ట్రంలో అధికార పంపిణీ ఒప్పందంపై చర్చించారు.