Home » Maharashtra
పదిరోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న మహారాష్ట్రలో.. అధికార కూటమి మహాయుతి, విపక్ష మహా వికాస్ ఆఘాఢీ(ఎంవీఏ) ఓటర్లపై వరాల జల్లులు కురిపించాయి.
మహారాష్ట్రలో మరో పది రోజుల్లో ఎన్నికలు జరగనుండగా అధికార మహాయుతి కూటమి, ప్రతిపక్ష మహారాష్ట్ర వికాస్ అఘాఢీ (ఎంవీఏ) కూటమి సమస్త బలగాలను మోహరించి గెలుపుకోసం శ్రమిస్తున్నాయి.
సిద్ధిఖి హత్య వెనుక గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్ చిన్న సోదరుడైన అన్మోల్ ఉన్నట్టు అనుమానిస్తుండగా, అన్మోల్ ప్రస్తుతం కెనడాలో ఉన్నట్టు సమాచారం. ముంబైలోని బాంద్రా ఏరియాలో సిద్దిఖిని అక్టోబర్ 21న ముగ్గురు సాయుధులు కాల్చిచంపారు.
భాగస్వామ్య పార్టీలైన బీజేపీ, ఏక్నాథ్ షిండే సారథ్యంలోని శివసేన, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సారథ్యంలోని ఎన్సీపీ తమతమ మేనిఫెస్టోలను విడుదల చేశాయని, ఎన్నికల అనంతరం మూడు పార్టీలకు చెందిన మంత్రులతో కమిటీ ఏర్పాటు చేసి హామీల ప్రాధ్యాన్యతా క్రమాన్ని నిర్ధారిస్తుందని అమిత్షా తెలిపారు.
మహారాష్ట్ర ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీలు ప్రచార కార్యక్రమాలను మరింత ఉధృతం చేశాయి. పోటాపోటీగా మేనిఫెస్టోలను కూడా విడుదల చేశాయి. ఇవాళ ఉదయం బీజేపీ సారధ్యంలోని కూటమి మేనిఫెస్టో విడుదల చేయగా.. కొద్దిసేపటికే ప్రతిపక్ష కూటమి మహా వికాస్ అఘాడి (MVA) కూడా మేనిఫెస్టోని ప్రకటించింది.
రుణమాఫీపై మహారాష్ట్రలో సీఎం రేవంత్ చెప్పినవన్నీ అబద్దాలేనని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు విమర్శించారు. రుణమాఫీ బోగస్, రైతుబంధు బోగస్, వరికి బోనస్ బోగస్. కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు.. గ్యారేజ్కు పోయాయని హరీష్రావు ఆరోపించారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇన్నాళ్లూ రైతు రుణమాఫీకి వ్యతిరేకంగా ఉంటూ వచ్చింది. కానీ ఈ విషయంలో మోడీ సర్కారు తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ఆ రాష్ట్రంలో సుడిగాలి పర్యటన చేశారు.
దేశచరిత్రలో మహారాష్ట్రకు ప్రత్యేక స్థానం ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తెలిపారు. దేశ గతిని మార్చిన ఎందరో మహానుభావులకు మహారాష్ట్ర గడ్డ జన్మనిచ్చిందని గుర్తుచేశారు.
రాజకీయ పార్టీలు, అభ్యర్థులు తమ ప్రచారంలో మహిళలను కించపరచేలా వ్యవహరించకుండా అధికారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సీఈసీ సూచించారు. వ్యక్తిగత జీవితాలపై విమర్శలు కూడదని, రాజకీయ ప్రత్యర్థులపై దిగజారుడు వ్యాఖ్యలు చేయరాదని అన్నారు.