Home » Mahesh Kumar Goud
సంక్రాంతి తర్వాత టీపీసీసీ కొత్త కార్యవర్గం కొలువుదీరనుంది. జనవరి మొదటి వారంలో ముగ్గురు కార్యనిర్వాహక అధ్యక్షులు, ప్రచార కమిటీ చైర్మన్ సహా కార్యవర్గాన్ని ఏఐసీసీ ఖరారు చేయనుంది.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మెదక్ జిల్లా పర్యటనలో భాగంగా ఏడుపాయల వన దుర్గా దేవి ఆలయాన్ని సందర్శించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సీఎంతో పాటు టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖతో పాటు పలువురు మంత్రులు, స్థానిక ప్రజాప్రతినిధులు వన దుర్గా దేవిని దర్శించుకున్నారు.
Telangana: కేంద్రమంత్రి అమిత్‌షాపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాజ్యాంగంపై నమ్మకమున్న ప్రతి పౌరునికి అమిత్ షా మాటలు బాధ పెట్టాయన్నారు. అమిత్ షాను సపోర్ట్ చేస్తున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వైఖరి కూడా ప్రజలకు అర్థమైందన్నారు.
సంధ్యా ధియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతిచెందిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ను చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. తెలంగాణ హై కోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో చర్లపల్లి సెంట్రల్ జైలు నుంచి బన్నిని విడుదల చేశారు. అయితే ఎపిసోడ్ కీలక ములుపులు తిరుగుతోంది.
Telangana: ఫార్ములా ఈకార్ రేస్ వ్యవహారంలో మాజీ మంత్రి కేటీఆర్‌పై కేసు నమోదు అవడంపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. చట్టపరంగా కేసు నమోదు అయినందున దీనిపై అసెంబ్లీలో కాదు, కోర్టులో తేల్చుకోవాలని సలహా ఇచ్చారు.
స్వాతంత్య్ర పోరాటం చేస్తుంటే బీజేపీ నేతలు బ్రిటిష్ వారికి తాబేదార్లుగా పని చేశారని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. అమిత్ షా వ్యాఖ్యలపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందించాలని అన్నారు.
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ బుధవారం కాంగ్రెస్ నేతలకు తాజ్ దక్కన్ హోటల్లో విందు ఇస్తున్నారు. ఆయన టీపీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టి 100 రోజులు దాటిన సందర్భంగా డిన్నర్ పార్టీ ఇస్తున్నారు.
బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో తెలంగాణ రాష్ట్రం వెనుకబడిందని టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ అన్నారు. ఇప్పటికైనా ఆ పార్టీ నేతలు.. అవాకులు చెవాకులు మాని ప్రభుత్వానికి సహకరించాలని హితవు పలికారు.
గతేడాది అంటే 2023 చివరిలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో తెలంగాణ ఓటరు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాడు. దీంతో రేవంత్ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ కొలువు తీరింది.
కాంగ్రెస్ సర్కారు పాలనలో తెలంగాణ పునర్వికాసం వైపు పయనిస్తోందని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ వ్యాఖ్యానించారు. ప్రజల ఆశీర్వాదాలతో రాష్ట్రాన్ని మరింత ప్రగతి పథంలోకి నడిపిస్తామన్నారు.