Home » Mallikarjun Kharge
వయనాడ్ లోక్సభ స్థానానికి ఉప ఎన్నిక నగారా మోగింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రియాంక గాంధీ బరిలో దిగుతున్నారు. ఈ నేపథ్యంలో అక్టోబర్ 23న కలపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆమె నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కార్యాలయం వెలుపల ఉన్నారు. దీంతో ఖర్గేను కాంగ్రెస్ పార్టీ పెద్దలు అవమానించారంటూ బీజేపీ ఆరోపణలు గుప్పించింది. దీనిపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది.
వయనాడ్లో ప్రియాంక గాంధీ తన నామినేషన్ పత్రాలను దాఖలు చేస్తున్న సమయంలో ఆఫీసర్ గదికి వెలుపల ఖర్గే వేచి ఉన్నట్టుగా వీడియోలో ఉంది. ఈ వీడియోను అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ సహా పలువురు బీజేపీ నేతలు షేర్ చేశారు. అయితే ఈ ప్రచారం అవాస్తవమని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. అసలు ఏం జరిగింది.
తన కొత్త ప్రయాణాన్ని వయనాడ్లో ప్రారంభిస్తున్నట్లు ప్రియాంకగాంధీ తెలిపారు. తాను రాజకీయాల కోసం ఇక్కడకు రాలేదని, ప్రజల ఉజ్వల భవిష్యత్తు కోసం వయనాడ్ వచ్చినట్లు తెలిపారు. రాజకీయానికంటే ఈ దేశం ముఖ్యమన్నారు. సమానత్వం కోసం కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందన్నారు. తన సోదరుడు రాహుల్ గాంధీ దేశం మొత్తం
బీజేపీ టెర్రరిస్టుల పార్టీ అంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే చేసిన వ్యాఖ్యలపై బీజేపీ శనివారం ఆగ్రహం వ్యక్తం చేసింది. టెర్రరిస్టులకు అండగా నిలిచేది ప్రతిపక్ష పార్టీనే అంటూ విమర్శలు గుప్పించింది.
కాంగ్రెస్ పార్టీని తరచు 'అర్బన్ నక్సల్' పార్టీగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విమర్శిస్తుండటంపై ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయనకు ఇది అలవాటుగా మారిందన్నారు.
మేకిన్ ఇండియా' ఘోరంగా విఫలమైందని మల్లికార్జున్ ఖర్గే తప్పుపట్టారు. ప్రజలపై గృహ రుణాల భారం పెరిగిందని, ధరలు పెరిగాయని, తయారీ రంగం కడగండ్ల పాలైందని అన్నారు.
పార్లమెంటులోని తన గదిలోకి కొందరు అధికారులు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ప్రవేశించారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆరోపించారు. ఈ చర్యపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ రాజ్యసభ చైర్మన్ జగ్దీప్ ధన్ఖడ్ కు లేఖ రాశారు.
సీఎం రేవంత్రెడ్డి సోమవారం సాయంత్రం ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు.
నరేంద్ర మోదీని గద్దె దింపేవరకూ తాను చనిపోనంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే చేసిన వ్యాఖ్యలపై మాటల యుద్ధం జరుగుతోంది. దీనిపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ హర్యానాలో సోమవారంనాడు జరిగిన ఎన్నికల ప్రచార సభలో స్పందించారు.
కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా మండిపడ్డారు. ఖర్గే కూడా కాంగ్రెస్ నేతల మాదిరిగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ అంటే కాంగ్రెస్ నేతలకు వెన్నులో వణుకు అని దుయ్యబట్టారు.