Home » Mallikarjun Kharge
తెలంగాణలో రైతు రుణమాఫీ అంశంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్(KTR) లేఖ రాశారు. రూ.40వేల కోట్లు రుణమాఫీ చేసినట్లు సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) చెప్తున్నారని, కానీ రూ.17వేల కోట్లు మాత్రమే మాఫీ చేసినట్లు కేటీఆర్ లేఖలో పేర్కొన్నారు.
కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ చైర్మన్‌గా అభిషేక్ మను సింఘ్వీని ఆ పార్టీ అధ్యక్షుడు ఖర్గే నియమించారు.
సీఎం రేవంత్‌రెడ్డి శుక్రవారం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో సమావేశమయ్యారు. దాదాపు గంటకుపైగా జరిగిన ఈ భేటీలో రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులు చర్చకు వచ్చినట్లు తెలిసింది.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఇవాళ(గురువారం) రాత్రి మరోసారి ఢిల్లీ వెళ్లనున్నారు. రెండ్రోజులపాటు పర్యటించి వివిధ కంపెనీలతో భేటీ కానున్నారు. అలాగే రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై అధిష్ఠానం పెద్దలతో మాట్లాడనున్నారు.
తెలంగాణ కాంగ్రె్‌సలో పదవుల భర్తీకి వేళయింది. దీనిపై అధిష్ఠానంతో చర్చించేందుకు సీఎం రేవంత్‌రెడ్డి శుక్రవారం (16న) ఢిల్లీకి వెళ్లనున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్‌గాంధీ, సంస్థాగత ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో భేటీ అయి టీపీసీసీ కార్యవర్గం, మంత్రివర్గ విస్తరణపైన చర్చించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
ప్రకృతి విపత్తుల కారణంగా.. ప్రజలకు కనీస మౌలిక సదుపాయాలు కూడా అందడం లేదని ఆందోళన చెందారు. ఈ నేపథ్యంలో ఆ యా అంశాలను ప్రచారాస్త్రాలుగా మలుచుకుని ప్రజల్లోకి వెళ్లాలని పార్టీ శ్రేణులకు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పిలుపునిచ్చారు.
ఏఐసీసీ ప్రక్షాళనపై కాంగ్రెస్ హై కమాండ్ దృష్టి సారించింది. ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో కీలక సమావేశం మరికాసేపట్లో జరగనుంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే అధ్యక్షతన కీలక సమావేశంలో పలు కీలక అంశాలపై దిశానిర్దేశం చేయనున్నారు.
కాంగ్రెస్ పార్టీ బలపడేందుకు వ్యూహ రచన చేస్తోంది. గత లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి సీట్లు తగ్గడం, కాంగ్రెస్ వంద మార్కును దాటడంతో పార్టీలో ఉత్సాహం రెట్టింపు అయ్యింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రతిపక్ష నేతగా అధికార పక్షాన్ని సమర్థవంతంగా ఎదుర్కొన్నారనే భావన ఆ పార్టీలో కలిగింది.
సెబీ చైర్పర్సన్ మాధవి బుచ్, ఆమె భర్త ధావల్ బుచ్‌కు విదేశాల్లో ఉన్న అదానీ కంపెనీల్లో వాటాలు ఉన్నాయంటూ అమెరికా షార్ట్‌సెల్లింగ్ సంస్థ హిండెన్‌బర్గ్ తాజాగా చేసిన ఆరోపణలపై దర్యాప్తునకు సంయుక్త పార్లమెంటరీ కమిటీని (జేపీసీ) ఏర్పాటు చేయాలని విపక్షాలు ముక్తకంఠంతో డిమాండ్ చేశాయి.