Home » Mamata Banerjee
పశ్చిమబెంగాల్ ఉపాధ్యాయ నియామక కుంభకోణం గురించి సుప్రీంకోర్టు చేసిన తీర్పు పై మమతా బెనర్జీ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఈ కేసులో న్యాయస్థానం తీర్పులు తీసుకోవడంపై ప్రజలలో వివిధ అభిప్రాయాలు వెల్లువెత్తాయి
సుప్రీంకోర్టు పశ్చిమ బెంగాల్లో 25 వేలమంది టీచర్ల నియామకాలను రద్దు చేస్తూ సంచలన తీర్పు వెలువరించింది. మొత్తం నియామక ప్రక్రియ అవకతవకలతో నిండి ఉందని ధర్మాసనం వ్యాఖ్యానించింది
బీజేపీ విభజన రాజకీయాలు చేస్తోందని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. కోల్కతాలోని రెడ్ రోడ్లో సోమవారంనాడు జరిగిన ఈద్ ప్రార్థనల్లో సీఎం పాల్గొన్నారు.
మమతతో జరిగిన చర్చలో మోడరేటర్ మాట్లాడుతూ, ఇండియా ఇప్పటికే యూకేను అధిగమించి ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందనీ, 2060 నాటికి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో తొలి స్థానానికి చేరుకుంటుందనే అంచనాలు ఉన్నాయని అన్నారు. ఇందుకు మమత స్పందిస్తూ ''దీనితో నేను విభేదిస్తు్న్నాను'' అని అన్నారు.
కొత్త పే-స్ట్రక్చర్ ప్రకారం ప్రస్తుతం రూ.65,000 వేతనం పొందుతున్న డిప్లొమో హోల్డింగ్ సీనియర్ రెసిడెంట్ డాక్టర్లు ఇకనుంచి రూ.80,000 వేతనంగా పొందుతారు. పోస్ట్ గ్రాడ్యుయేట్ సీనియర్ రెసిడెంట్ డాక్టర్ల వేతనం రూ.70,000 నుంచి రూ.85,000కు పెరిగింది.
మహాకుంభ్ నిర్వాహకులు సరైన క్రౌడ్ మేనేజిమెంట్ ప్రక్రియను పాటించలేదని అవిముక్వేశర్వానంద్ సరస్వతి విమర్శించారు. మమతా బెనర్జీ వ్యాఖ్యలకు సమర్ధనగా ఆయన తాజా వ్యాఖ్యలు చేశారు.
మమతా బెనర్జీ చేసిన 'మృత్యుకుంభ్' వ్యాఖ్యలపై అఖిల్ భారతీయ సంత్ సమితి తీవ్ర ఆక్షేపణ తెలిపింది. మమతా బెనర్జీ రాజకీయ ఆశలకు రాబోయే పశ్చిమబెంగాల్ ఎన్నికలే చివరివవుతాయని హెచ్చరించింది.
ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో మహాకుంభ మేళా నిర్వహణలోపాలపై అక్కడి బిజేపీ ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని మమతా బెనర్జీ తప్పుపట్టారు.
పశ్చిమబెంగాల్ అసెంబ్లీలో బుధవారంనాడు బడ్జెట్ సమర్పణ అనంతరం మీడియాతో ఆమె మాట్లాడుతూ, పెద్ద సంఖ్యలో భక్తులు కుంభమేళాకు వస్తున్నప్పటికీ సరైన ఏర్పాట్లు చేయలేదని మమతా బెనర్జీ ఆరోపించారు.
తృణమూల్ కాంగ్రెస్ శాయశక్తులా కృషి చేసినప్పటికీ కాంగ్రెస్ వైఫల్యం కారణంగానే లోక్సభ ఎన్నికల్లో 'ఇండియా' కూటమి విజయం సాధించలేకపోయిందని తాను రాసిన పుస్తకంలో మమతాబెనర్జీ ఆరోపించారు.