Home » Manda Krishna Madiga
కొన్ని దశాబ్దాలుగా దేశంలో రగులుతున్న ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ సమస్యకు సుప్రీంకోర్టు తెరవేసింది. షెడ్యూల్డు కులాలు, షెడ్యూల్డు తెగల ఉప వర్గీకరణ ఆమోద యోగ్యమేనని, ఆయా వర్గాల్లో అత్యంత వెనుకబడిన ఉప వర్గాల వారికి రాష్ట్రాల స్థాయిలో కోటాలో ప్రత్యేక కోటా ...
మూడు దశాబ్ధాల పోరాటం ఫలించింది. ఎందరో నాయకుల ఆకాంక్ష నెరవేరింది. 30 ఏళ్ల పోరాటంలో ఎన్నో ఒడిదుడుకులు.. తమ హక్కుల కోసం పోరాటం.. తమ కళ నెరవేరిందనుకున్న సమయంలో న్యాయస్థానం రూపంలో అడ్డంకులు.. వెరసి.. మరో 20 ఏళ్ల నిరీక్షణ తర్వాత ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది.
Andhrapradesh: ఎస్సీ, ఎస్టీ వర్గీకరణకు సంబంధించి సుప్రీంకోర్టు తీర్పుపై ఎమ్మార్పీస్ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ స్పందించారు. గురువారం నాడు మీడియాతో మాట్లాడుతూ... గతంలో చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు చేసిన ఎస్సీ వర్గీకరణపై ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఇప్పుడు అది ఏపీలో అమలు అవుతుందన్నారు. చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణ అమలు జరుగుతుందన్న నమ్మకం తమకు ఉందని తెలిపారు.
ఎస్సీ వర్గీకరణ చేసిన ఘనత టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకే దక్కుతుందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మంద కృష్ణమాదిగా తెలిపారు. ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు.. అలా చేయడం వల్లే ఎంతో మంది ఎస్సీలకు ఉద్యోగాలు దక్కాయన్నారు. చంద్రబాబు నాయుడు ఆ రోజు అలా చేయకుంటే.. ఎస్సీల పరిస్థితి మరోలా ఉండేదన్నారు.
మాదిగ సామాజిక వర్గానికి కాంగ్రెస్ పార్టీ వెన్నుపోటు పొడిచిందని, రేవంత్‌రెడ్డి వల్ల మాదిగలను, బీసీలను కాంగ్రెస్ పార్టీ దూరం చేసుకున్నదని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ(Manda Krishnamadiga) ఆరోపించారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) మోసగాడని.. తమను నిలువునా మోసం చేశారని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ (Manda Krishna Madiga) అన్నారు. కేసీఆర్‌కి మనం అండగా నిల్చున్న రోజులు చాలా ఉన్నాయని.. ఆయన మనల్ని పట్టించుకోలేదని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని ఆయన మాట తప్పాడనీ ప్రశ్నిస్తే తనను జైల్లో పెట్టించారని విరుచుకుపడ్డారు.
మాదిగలకు టిక్కెట్ల కేటాయింపులో అన్యాయం చేసిన సీఎం రేవంత్ రెడ్డికి లోక్‌సభ ఎన్నికల్లో తమ సత్తా ఏమిటో చూపిస్తామని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు(Motkupalli Narsimhulu) అన్నారు. కాంగ్రెస్ పార్టీ 14 సీట్లు గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని ఆయన అన్నారు.
Telangana: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రేవంత్ రెడ్డి ఓ బ్రోకర్ అంటూ వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ఉద్యమం చేసి సీఎం కాలేదని.. బోకరిజం చేస్తూ సీఎం అయ్యారని కామెంట్స్ చేశారు. ప్రజాభిమానం ఉంటే రేవంత్ రెడ్డి కామారెడ్డిలో ఓడిపోయేవాడు కాదన్నారు. కడియం శ్రీహరిని తానే పిలిచాను అని రేవంత్ అన్నారని..
కాంగ్రెస్ (Congress) హయాం మొత్తం స్కామ్‌లేనని ఎమ్మార్పీఎస్ అభ్యక్షుడు మందకృష్ణ మాదిగ (Mandakrishna Madiga) ఆరోపించారు. ఆదివారం నాడు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మాదిగల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మందకృష్ణ మాదిగ, బీజేపీ మహబూబ్‌నగర్ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ హాజరయ్యారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి(Daggubati Purandeswari)ని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ(Manda Krishna Madiga) మర్యాద పూర్వకంగా కలిశారు. సోమవారం నాడు బీజేపీ కార్యాలయంలో రెండు గంటల పాటు చర్చలు జరిపారు. రాబోయే ఎన్నికలకు సంబంధించి పలు కీలక అంశాలపై చర్చించారు.