Home » Manish Sisodia
లిక్కర్ స్కామ్ (Liquor Scam)కేసులో ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ఆయన దాఖలు చేసుకున్న బెయిల్ అభ్యర్థనను ఢిల్లీ హైకోర్టు మంగళవారంనాడు తోసిపుచ్చింది.
ఎక్సైజ్ పాలసీ కేసులో 'ఆప్' నేత మనీష్ సిసోడియాకు మరోసారి నిరాశ ఎదురైంది. ఆయన రెండోసారి దాఖలు చేసుకున్న బెయిల్ దరఖాస్తును రౌస్ అవెన్యూ కోర్టు మంగళవారంనాడు తోసిపుచ్చింది. ఆయనకు బెయిల్ ఇచ్చే విషయంపై సీబీఐ, ఈడీలు రెండూ అభ్యంతరం వ్యక్తం చేశాయి.
దిల్లీ మద్యం కుంభకోణం ( Delhi Liquor Case ) కేసులో మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ప్రధాన నిందితుడని, సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉన్నందున బెయిల్ ను వ్యతిరేకిస్తున్నట్లు సీబీఐ న్యాయవాది రూస్ అవెన్యూ కోర్టుకు వెల్లడించారు.
దేశ రాజధాని ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి, ఆప్ నేత మనీష్ సిసోడియా మధ్యంతర బెయిల్ కోసం రౌస్ అవెన్యూ కోర్టులో శుక్రవారం పిటిషన్ దాఖలు చేశారు. సీబీఐ, ఈడీ ప్రత్యేక న్యాయమూర్తి కావేరీ బవేజా ఈ పిటిషన్‌ను కాసేపట్లో పిటిషన్‌పై విచారణ చేపట్టే అవకాశం ఉంది.
దిల్లీ మద్యం కేసులో అరెస్టైన దిల్లీ మాజీ డిప్యూటీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ ( AAP ) నేత మనీష్ సిసోడియా జ్యుడీషియల్ కస్టడీని మరో 12 రోజులు పొడిగించారు.
అవినీతికి వ్యతిరేకంగా.. సుపరిపాలన అందిచడమే లక్ష్యంగా.. అన్నాహజారే ఉద్యమంలోంచి పుట్టిన పార్టీ. అతి తక్కువ సమయంలో దేశ రాజధాని ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. దేశం మొత్తం పార్టీని విస్తరించేందుకు ఆప్ అధినేత కేజ్రీవాల్ అడుగులు వేస్తున్నారు.
ఢిల్లీ లిక్కర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు మరోసారి ఈడీ సమన్లు పంపించింది. మద్యం విధానం కేసు దర్యాప్తులో విచారణకు హాజరు కావాలని కేజ్రీకి ఈడీ సమన్లు ఏడోసారి సమన్లు పంపించింది. ఈ నెల 26న హాజరు కావాలని సూచించింది.
ఎక్సైజ్ పాలసీ కుంభకోణం కేసులో ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా జ్యుడిషియల్ కస్టడీని డిసెంబర్ 11వ తేదీ వరకూ రౌస్ అవెన్యూ కోర్టు మంగళవారంనాడు పొడిగించింది. నిందితులపై పలు డాక్యుమెంట్లను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఫైల్ చేయాల్సి ఉందని కోర్టు అభిప్రాయపడింది.
లిక్కర్ కుంభకోణంలో అరెస్టయి జైలులో ఉన్న ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా శనివారంనాడు కోర్టు అనుమతితో తన నివాసానికి వెళ్లారు. న్యూరోలాజికల్ సమస్యతో బాధపడుతున్న భార్యను చూసేందుకు, 6 గంటల సేపు అక్కడ ఉండేందుకు సిటీ కోర్టు ఆయనకు అనుమతినిచ్చింది.
ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు సుప్రీం కోర్టులో చుక్కుదురైంది. మనీష్ సిసోడియాకు బెయిల్ ఇచ్చేందుకు సుప్రీం నిరాకరించింది.