Home » Medak
మెదక్ జిల్లా నిజాంపేట మండలం నందిగామ రైస్‌మిల్‌పై గురువారం రాత్రి విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ బృందం మెరుపు దాడులు చేపట్టింది. దీనిలో భారీగా పీడీఎస్ (రేషన్ బియ్యం) నిల్వలు గుర్తించారు.
గజ్వేల్ పట్టణం జాలిగామ బైపాస్ వద్ద ఘోర రోడ్డుప్రమాదం చోటు చేసుకుంది. గుర్తుతెలియని వాహనం ఢీకొని ఇద్దరు కానిస్టేబుళ్లు అక్కడికక్కడే మృతిచెందారు.
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక సర్వేకు పైలట్ ప్రాజెక్ట్ జిల్లాలుగా మెదక్, నిజామాబాద్, మహబూబ్‌నగర్, భద్రాద్రి కొత్తగూడెం ఎంపికయ్యాయి. సర్వే ఆధారంగా లబ్ధిదారుల వివరాలను ‘ఇందిరమ్మ’ యాప్‌లో నమోదు చేయనున్నట్లు మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ శనివారం తెలిపారు.
అప్పులు బాధ తాళలేక ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. మెదక్ జిల్లా రామాయంపేట మండలం కాట్రియాల గ్రామానికి చెందిన కాట్రియాల రాజు (45) తనకున్న ఎకరం అసైన్డ్ భూమిలో వ్యవసాయం చేసుకుంటున్నాడు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ శుక్రవారం ఉదయం సంగారెడ్డి జిల్లాకు వెళ్లనున్నారు. ఉదయం 9:30 గంటలకు నందినగర్‌లోని తన నివాసం నుంచి కేటీఆర్ సంగారెడ్డికి బయలుదేరనున్నారు. బీఆర్ఎస్ సీనియర్ నేతలతో కలసి 11 గంటలకు సంగారెడ్డికి చేరుకోనున్నారు. జైలులో ఉన్న లఘుచర్ల గ్రామ రైతులను కేటీఆర్ బృందం పరామర్శించనుంది.
ఒంటరిగా ఉన్నవారితో మాటలు కలుపుతాడు. స్నేహం పేరుతో పూటుగా మద్యం తాగించి బండారాయితో కొట్టి చంపుతాడు.
మెదక్ జిల్లాలో వరుస హత్యలకు పాల్పడుతున్న నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.
యూపీఐ అందుబాటులోకి వచ్చాక నగదు చెల్లించే విధానం చాలా వరకు తగ్గిపోయింది. ఫోన్ పే, గూగుల్ పే వంటి యాప్‌లకు అలవాటు పడిన చాలా మంది జేబులో డబ్బులు ఉంచుకోవడం లేదు.
Telangana: డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదవుతున్న ఓ విద్యార్థిని ఎగ్జామ్ రాసేందుకు కాలేజ్‌కు వచ్చింది. అయితే ఆమె వెంటే ఉన్న అపాయాన్ని గుర్తించ లేకపోయింది విద్యార్థిని. ఎగ్జామ్ రాసేందుకు వెళ్తున్న సమయంలో యువతికి అనుకోని ప్రమాదం ఎదురైంది. తప్పించుకుందామని అనుకునే లోపే తీవ్ర గాయాలపాలైంది సదరు యువతి.
మెదక్ జిల్లాలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనాన్ని ఎదురుగా వచ్చిన ట్రాక్టర్ ఢీకొట్టిన ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ప్రాణాలు కోల్పోయారు.