Home » Medical News
ఆరోగ్య సమస్యలను, వ్యాధులను నయం చేస్తాయంటూ పలు కంపెనీలు విక్రయిస్తున్న హెల్త్ సప్లిమెంట్లను ఔషధాల జాబితాలో చేర్చాలని కేంద్ర ప్రభుత్వానికి ఓ అంతర్ మంత్రిత్వశాఖల కమిటీ సిఫార్సు చేసింది.
ఫిలిప్పైన్స్‌లో రాష్ట్ర వైద్య విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. మృతురాలు సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ఇంద్రేశానికి చెందిన సిగ్ధ. శుక్రవారం ఆమె పుట్టినరోజు.
రాష్ట్రంలోని ఆసుపత్రులు, మెడికల్ షాపులపై ఆరోగ్య శాఖ నజర్ పెట్టింది. నకిలీ, నాసిరకం మందులను ఎక్కువ ధరకు అమ్మే వారిపై కొరడా ఝులిపించేందుకు సిద్ధమైంది.
దేశవ్యాప్తంగా 2024-25 విద్యా సంవత్సరానికి కొత్తగా 72 నూతన వైద్య కళాశాలలకు అనుమతులు మంజూరు చేసినట్లు జాతీయ వైద్య కమిషన్(ఎన్ఎంసీ) వెల్లడించింది.
ఉద్యోగుల మెడికల్ రీయింబర్స్మెంట్ దరఖాస్తులను ఆన్లైన్ ద్వారా స్వీకరించాలని సర్కారు నిర్ణయించింది. ఈ దిశగా వైద్య ఆరోగ్యశాఖ కసరత్తు చేస్తోంది. ఇప్పటి దాకా మెడికల్ రీయింబర్స్మెంట్ బిల్లులను నేరుగా తీసుకుని స్ర్కూట్నీ చేస్తున్నారు.
అమ్మ చేతి గోరు ముద్ద.. బిడ్డలకు అమృతంతో సమానం! కానీ.. అది ఒకప్పటి మాట!! మనిషి జీర్ణకోశ కణజాలానికి పట్టుకుని అల్సర్ నుంచి జీర్ణాశయ క్యాన్సర్ దాకా పలు వ్యాధులకు, సమస్యలకు కారణమయ్యే హెలికోబ్యాక్టర్
తెలంగాణ మెడికల్ కాలేజెస్ రూల్స్- 2021లోని రూల్ 8 (1) (2)ల చట్టబద్ధతపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం, కాళోజీ వైద్య విశ్వవిద్యాలయాలకు హైకోర్టు నోటీసులు జారీచేసింది.
అనారోగ్యంతో మెడికవర్ ఆస్పత్రికి వచ్చిన జూనియర్ డాక్టర్ నాగప్రియ చికిత్స పొందుతూ మృతి చెందింది. ఇప్పటి వరకు మూడులక్షలకుపైగా కుటుంబసభ్యులు ఆస్పత్రికి డబ్బులు కట్టారు. మిగతా 4 లక్షల రూపాయలు కడితేనే డెడ్ బాడీ ఇస్తామని ఆస్పత్రి వర్గాలు చెప్పాయి. దీంతో నాగప్రియ కుటుంబసభ్యులు ఎమ్మెల్యే గాంధీతో చెప్పించారు. అయినా ఆస్పత్రి యాజమాన్యం వినలేదు.
దేశవ్యాప్తంగా వైద్య ఖర్చులు పెరిగిపోతుండగా.. తెలంగాణలో మాత్రం అతి తక్కువగా పెడుతుండడం విశేషం. అవును మీరు చదివింది నిజమే! వైద్యంపై అతి తక్కువ ఖర్చు చేస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ అగ్రస్థానంలో ఉంది!
శరీరంలో వాపులను తగ్గించే స్టిరాయిడ్ ఔషధాల వాడకం రాష్ట్రంలో విచ్చలవిడిగా పెరిగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా వాటి అమ్మకాలు భారీగా పెరుగుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఆర్ఎంపీ వైద్యులు.. నొప్పులంటూ తమ వద్దకు వస్తున్న పేదసాదలకు తక్షణ ఉపశమనం కలిగించేందుకు అడ్డగోలుగా స్టిరాయిడ్ ఇంజెక్షన్లు చేసేస్తున్నారు.