Home » Medical News
దేశవ్యాప్తంగా వైద్య ఖర్చులు పెరిగిపోతుండగా.. తెలంగాణలో మాత్రం అతి తక్కువగా పెడుతుండడం విశేషం. అవును మీరు చదివింది నిజమే! వైద్యంపై అతి తక్కువ ఖర్చు చేస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ అగ్రస్థానంలో ఉంది!
శరీరంలో వాపులను తగ్గించే స్టిరాయిడ్ ఔషధాల వాడకం రాష్ట్రంలో విచ్చలవిడిగా పెరిగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా వాటి అమ్మకాలు భారీగా పెరుగుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఆర్ఎంపీ వైద్యులు.. నొప్పులంటూ తమ వద్దకు వస్తున్న పేదసాదలకు తక్షణ ఉపశమనం కలిగించేందుకు అడ్డగోలుగా స్టిరాయిడ్ ఇంజెక్షన్లు చేసేస్తున్నారు.
మీసాలు గడ్డాలు ఉండొద్దని.. తాము చెప్పిన కళ్ళజోడే వాడాలంటూ సీనియర్ వైద్య విద్యార్థులు జూనియర్లను వేధిస్తున్నారు. మీసాలు, గడ్డాలు తీసేయాలని, మేం చెప్పిన యాప్లనే స్మార్ట్ఫోన్లో డౌన్లోడ్ చేసుకోవాలని వత్తిడి తెస్తున్నారని జూనియర్ విద్యార్థులు చెబుతున్నారు. సీనియర్ల ర్యాగింగ్ వల్ల జూనియర్ వైద్య విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారు.
సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో రెండు రోజులుగా నీటి సరఫరా లేకపోవడంతో శస్త్ర చికిత్సలు వాయిదా పడ్డాయి. నీటి సరఫరా కొనసాగేవరకూ ఆపరేషన్లు జరగవని వైద్యులు స్పష్టం చేశారని రోగులు వాపోతున్నారు.
వైద్య విద్య సంచాలకుల(డీఎంఈ) పరిఽధిలో నిర్ణయాలు తీసుకోవడంలో తీవ్ర జాప్యం నెలకొంటోంది. పదోన్నతులు, పదవుల భర్తీ... వంటి నిర్ణయాలన్నీ నత్తనడకను తలపిస్తున్నాయి.
అర్హత లేకనే మందుల (ఔషధ) దుకాణాలు పెట్టేసి, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. వైద్యుల సిఫారసు లేకుండా ఇస్తున్న మందులతో రోగుల ప్రాణాల మీదకు వస్తోంది.
తెలంగాణలో మరో కొత్త ప్రైవేట్ వైద్యవిద్య కళాశాలకు జాతీయ వైద్య కమిషన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అందులో 150 ఎంబీబీఎస్ సీట్లకు అనుమతులు జారీ చేసింది.
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో కొలువుల మేళా కొనసాగుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఇప్పటికే 7300 పోస్టులను భర్తీ చేసింది. మరో 6500 ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది.
ప్రభుత్వ వైద్యులు, సిబ్బంది నిర్ణీత పని వేళలు పాటించకపోవడంపై ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ ఆగ్రహం వ్యక్తంచేశారు.
వైద్య రంగంలో అందించిన విశేష సేవలకుగానూ అమెరికాకు చెందిన శాస్త్రవేత్తలు విక్టర్ ఆంబ్రోస్, గ్యారీ రువ్కున్లను ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన నోబెల్ పురస్కారం వరించింది.