Home » Medigadda Barrage
Kaleshwaram commission: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల అవకతవకలపై న్యాయ విచారణకు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే ప్రభుత్వం మరోసారి గడువును పొడిగించింది. ఈ మేరకు ఉత్తర్వులు విడుదల చేసింది.
మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడానికి, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల సీపేజీలకు డిజైన్ లోపాలే ప్రధాన కారణమని జాతీయ ఆనకట్టల భద్రత సంస్థ(ఎన్డీఎ్సఏ) నిపుణుల కమిటీ తేల్చింది.
హైకోర్టులో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్రావు తదితరులకు కాస్త ఊరట లభించింది.
Kaleshwaram Commission: మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు వ్యవహారంలో ఎల్ అండ్ టీ ప్రతినిధులను కాళేశ్వరం కమిషన్ విచారించింది. ఈ విచారణలో సంస్థ ప్రతినిధులు కీలక వివరాలను బహిర్గతం చేశారు. మేడిగడ్డ బ్యారేజీ గురించి ఎల్ అండ్ టీ ప్రతినిధులు చెప్పిన హాట్ హాట్ నిజాలను ఇప్పుడు తెలుసుకుందాం..
రాజకీయాల జోలికి వెళ్లకుండా ప్రాణహిత-చేవెళ్ల కాదని, కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించడానికి కారణాలను మాత్రమే వివరించాలని జస్టిస్ ఘోష్ కమిషన్ తెలంగాణ జలవనరుల అభివృద్ధి సంస్థ(టీఎ్సఐడీసీ) మాజీ చైర్మన్, బీఆర్ఎస్ నేత వి.ప్రకాశ్రావుకు సూచించింది.
భీకర వరదను తట్టుకునే వ్యవస్థలు లేకపోవడమే మేడిగడ్డ బ్యారేజీ దెబ్బతినడానికి కారణమని ఐఐటీ రూర్కీ నిపుణుల నమూనా అధ్యయనం తేల్చింది.
మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుపై భూపాలపల్లి జిల్లా కోర్టులో ఉన్న కేసును కొట్టేయాలని కోరుతూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్రావు హైకోర్టులో సోమవారం క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు.
మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు కట్టాలని నిర్ణయం తీసుకున్నది మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్రావులేనని ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి (సీఎస్) శైలేంద్రకుమార్ జోషి తెలిపారు.
కాళేశ్వరం ప్రాజెక్టు కారణంగా తమ సాగు భూములు ముంపునకు గురవుతున్నాయని మహారాష్ట్ర రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మేడిగడ్డ బ్యారేజీలో 2019లో నీటిని నింపినప్పుడే బుంగలు ఏర్పడ్డాయని, ఏడో బ్లాకు కింద ఇసుక కొట్టుకుపోవడ మే దీనికి కారణమని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ తేల్చి చెప్పింది.