Home » Meesala Geetha
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో (AP Elections 2024) కీలక ఘట్టం ముగిసింది. ఏప్రిల్-18న ప్రారంభమైన నామినేషన్ల పర్వం ఏప్రిల్-25తో ముగిసింది. ఇక నామినేషన్ల విత్ డ్రా కూడా ఇవాళ (ఏప్రిల్-29తో) ముగిసింది. ఈ ఎన్నికల్లో టికెట్లు దక్కని చాలా మంది నేతలు రెబల్స్‌గా మారి నామినేషన్లు దాఖలు చేయడం జరిగింది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడటంతో కొన్ని నియోజకవర్గాల సీట్లను తెలుగు తమ్ముళ్లకు ఇవ్వలేకపోయింది హైకమాండ్. దీంతో వారంతా రెబల్స్‌గా మారి నామినేషన్లు వేశారు. ఇందులో కొందరు నామినేషన్లు విత్ డ్రా చేసుకోగా.. మరికొందరు మాత్రం తగ్గేదేలా అంటూ బరిలోనే ఉన్నారు. విత్ డ్రాకు గడువు ముగియడంతో ఇప్పుడు వారందరికీ ఎన్నికల కమిషన్ గుర్తులను కేటాయించే పనిలో నిమగ్నమైంది.
AP Elections 2024: ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో (AP Assembly Elections ) టికెట్ల లొల్కికి ఇప్పట్లో ఫుల్స్టాప్ పడే అవకాశాలు కనిపించట్లేదు. అసంతుష్టులను బుజ్జగించడానికి అధినేతలు, అగ్రనేతలు చేసిన ప్రయత్నాలు ఫలించట్లేదు. అధికార, ప్రతిపక్ష పార్టీలన్నింటిలోనూ ఇదే పరిస్థితి. టికెట్లు దక్కని వారు ఇండిపెండెంట్లుగా పోటీచేస్తామని ప్రకటించడమా..? లేకుంటే పార్టీకి గుడ్ బై చెప్పేసి ఏదోక కండువా కప్పేసుకోవడమా..? లాంటివి చేస్తున్నారు..