Home » Metro News
మెట్రో రెండోదశకు సంబంధించిన నిధుల సేకరణ సన్నాహాలు వేగంగా జరుగుతున్నాయి. వచ్చే ఎన్నికల్లోపు ప్రాజెక్టులో 70 శాతం పనులను పూర్తి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం వడివడిగా ముందుకు సాగుతోంది.
రైళ్లలో మరుగుదొడ్డిని ఉచితంగానే వినియోగించుకోవచ్చు. అయితే ముంబయి మెట్రో తీసుకొచ్చిన కొత్త నిబంధన చర్చనీయాంశం అయింది. మెట్రోలో ప్రయాణించేవారు టాయిలెట్ కు వెళ్లాలంటే టాయిలెట్ పాస్ తప్పనిసరిగా నింపాల్సిందేనని కండీషన్ పెట్టింది.
నగర రవాణాలో మెట్రోరైలు వ్యవస్థ అత్యంత కీలకంగా మారింది. మెట్రో రైళ్లలో ప్రతిరోజూ సగటున 4.70 లక్షల మంది తమ గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. ప్రత్యేక రోజుల్లో వీరి సంఖ్య ఐదు లక్షలకు పైమాటే.
నాగోల్, మియాపూర్ మెట్రో స్టేషన్లలో పార్కింగ్ ఫీజు వసూలు చేసేందుకు ఎల్ అండ్ టీ సిద్ధమైంది. 6వ తేదీ నుంచి నామమాత్రపు రుసుముతో ప్రారంభిస్తామని ఒక ప్రకటనలో వెల్లడించింది. దీంతో ప్రయాణికులు భగ్గుమంటున్నారు.
ప్రయాణికులకు ఎల్ అండ్ టీ హైదరాబాద్ మెట్రో యాజమాన్యం షాక్ ఇచ్చింది. నాగోల్, మియాపూర్ స్టేషన్ల వద్ద వాహనాల ఉచిత పార్కింగ్ సౌకర్యాన్ని ఎత్తేస్తూ మరోసారి నిర్ణయం తీసుకుంది.
హైదరాబాద్లోని అన్ని ప్రాంతాలకూ మెట్రో సదుపాయం కల్పించాలనే లక్ష్యంతో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం.. ఇందుకోసం రెండో దశలో సరికొత్త కారిడార్లను తీసుకొస్తోంది.
హైదరాబాద్ మెట్రో రెండో దశ పనుల్లో భాగంగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రో అలైన్మెంట్ మారుస్తూ కాంగ్రెస్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఆరాంఘర్-బెంగళూరు హైవే, కొత్త హైకోర్టు మీదుగా విమానాశ్రయానికి నూతన లైన్ ఖరారు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.
Ganesh Immersion Hyderabad: భాగ్యనగరంలో వినాయక నిమజ్జనం కార్యక్రమం కనుల పండువగా సాగుతోంది. వేలాది విగ్రహాలు వడి వడిగా గంగమ్మ ఒడికి చేరేందుకు వస్తున్నాయి. నగరం నలుమూలల నుంచి వినాయక విగ్రహాని హుస్సేన్ సాగర్ తీరానికి చేరుతుండటంతో ఆయా రూట్లలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు..
మెట్రోరైళ్లలో(Metro trains) అదనపు కోచ్ల అంశమే అడ్రస్ లేకుండా పోయింది. ప్రస్తుతం నడుస్తున్న రైళ్లకు అదనంగా 40 నుంచి 50 బోగీలను నాగ్పూర్(Nagpur) నుంచి తీసుకొచ్చి ప్రయాణికులకు అందుబాటులో ఉంచుతామని గతంలో సూచనప్రాయంగా ప్రకటించిన హెచ్ఎంఆర్, ఎల్అండ్టీ ఇప్పుడు ఆ విషయాన్ని పట్టించుకోవడం లేదు.
ఎంజీబీఎస్-చాంద్రాయణగుట్ట(MGBS-Chandrayanagutta) వరకు చేపడుతున్న 7.5 కిలోమీటర్ల మెట్రోమార్గానికి కావాల్సిన ఆస్తుల సేకరణను ప్రారంభించారు. ఈ రూట్లో రోడ్డు విస్తరణ, స్టేషన్ల నిర్మాణానికి దాదాపు 1200 వరకు ఆస్తులు అవసరం ఉన్నాయి.