Home » Military
జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో ఉగ్రవాదులు జరిపిన భీకర కాల్పుల్లో ఇద్దరు భారత సైనికులు అమరులయ్యారు. మరో నలుగురు గాయపడ్డారు.
బంగ్లాదేశ్‌లో ఉద్రిక్త పరిస్థితులు ఇంకా తగ్గకపోవడంతో.. భారత్ అప్రమత్తమైంది. హింస నేపథ్యంలో ఇండో-బంగ్లా సరిహద్దు వెంబడి చొరబాట్లకు అవకాశాలుండడంతో.. సరిహద్దు భద్రత దళం(బీఎ్‌సఎఫ్) నిఘాను పెంచింది.
పాకిస్థాన్ ప్రత్యేక సైన్యంతోపాటు ఉగ్రవాదులతో కూడిన ‘బోర్డర్ యాక్షన్ టీమ్’ (బ్యాట్ దళం) భారత ఆర్మీ పోస్టుపై చేసిన అకస్మాత్తు దాడిలో ఓ జవాను మృతి చెందగా, కెప్టెన్ సహా నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.
కార్గిల్ యుద్ధాన్ని భారత్ గెలిచి పాతికేళ్లు అవుతోందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. యుద్ధంలో మన సైనికులు చేసిన త్యాగం చిరస్మరణీయమని ఆయన ఒక ప్రకటనలో కొనియాడారు.
ఒక్క నెలలోనే ఆరు ఉగ్ర దాడులు జమ్మును కుదిపేశాయి. 20 మందికిపైగా ఆర్మీ జవాన్లను పొట్టనబెట్టుకున్న ఈ దాడులను రక్షణ శాఖ సవాల్‌గా తీసుకుంది. జమ్ము పరిధిలోని దట్టమైన అడవుల్లో దాగి, ఆర్మీపై దొంగ దాడులు చేస్తున్న ముష్కరుల పని పట్టేందుకు 500 మందితో కూడిన పారా కమాండో దళాన్ని రంగంలోకి దించింది.
భారతదేశంలోకి అక్రమంగా చొరబడేందుకు ప్రయత్నించిన ముగ్గురు ఉగ్రవాదులను భారత దళాలు కాల్చి చంపాయి. ఆదివారం సైనిక దళాలు ....
మణిపూర్‌లో జిరిబం జిల్లాలోని మాంగ్‌బంగ్ ప్రాంతంలో ఆదివారం ఉదయం భద్రతా బలగాలపై జరిగిన దాడిలో ఓ సీఆర్పీఎ్ఫ(సెంట్రల్ రిజర్వ్డ్ పోలీస్ ఫోర్స్) జవాన్ మృతి చెందారు.
అగ్నిపథ్ అభ్యర్థుల వయోపరిమితిని 23 ఏళ్లకు పెంచాలని, నాలుగేళ్ల తర్వాత కనీసం 50% మందిని కొనసాగించాలని సాయుధ దళాలు కేంద్రానికి సిఫారసు చేయనున్నాయి.
పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో ఇండియాలోనే అభివృద్ధి చేసిన సెమీ కండక్టర్(చిప్) సాయంతో భారత సైన్యం కోసం 4జీ మొబైల్ కమ్యూనికేషన్ బేస్ స్టేషన్‌ను ఏర్పాటు చేశారు.
భారత 30వ సైన్యాధిపతిగా జనరల్ ఉపేంద్ర ద్వివేది బాధ్యతలు చేపట్టారు. ఆయనకు పాకిస్థాన్, చైనా సరిహద్దుల్లో పనిచేసిన సుదీర్ఘ అనుభవం ఉంది.