Home » Minister Nara Lokesh
బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని మంత్రి లోకేష్ భరోసా ఇచ్చారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని అన్నారు. మృతుల కుటుంబ సభ్యులకు మంత్రి లోకేష్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
ఐటీ, ఇంధనం, టూరిజం, ఎరోస్పేస్, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో 30కిపైగా ప్రాజెక్టులకు ఈ సమావేశంలో ఆమోదం లభించింది. వీటి ద్వారా 67 వేల ఉద్యోగాలు వస్తాయని అంచనా. దేశ చరిత్రలోనే అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడికి 11వ ఎస్ఐపీబీ ఆమోదం తెలిపింది.
ట్రిపుల్ ఐటీల్లో మెస్ నిర్వహణ బాధ్యతను అక్షయపాత్రకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అప్పగించారు. లోకేష్ తన మాటనిలబెట్టుకున్నారని విద్యార్థులు ధన్యవాదాలు తెలిపారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, విద్యశాఖల మంత్రి నారా లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ ఫేక్ డ్రామా మరోసారి బెడిసికొట్టిందని విమర్శించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సోమవారం ముంబైలో పర్యటించనున్నారు. పలువురు పారిశ్రామికవేత్తలను ఆయన కలువనున్నారు. ఏపీలో పెట్టుబడులు పెట్టాలని వివిధ కంపెనీల నిర్వాహకులను ఆహ్వానించనున్నారు మంత్రి లోకేష్.
ఆటోలో బ్యాగ్ మర్చిపోతే ఆటోడ్రైవర్లు వాటిని జాగ్రత్తగా పోలీసులకు అప్పగిస్తారని లోకేష్ చెప్పారు. అంతేకాకుండా.. ‘అప్పు చేసి కొన్నా ... నన్ను చూసి ఏడవద్దు’ అంటూ కొన్ని కామెడీ కొటేషన్లు కూడా ఆటోల వెనక రాస్తారన్నారు.
ఆటో డ్రైవర్ల సేవలో పథకాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, మంత్రి నారా లోకేష్‌లు పాల్గొన్నారు.
దేశ స్వాతంత్ర్య సముపార్జనలో ముందుండి దేశాన్ని నడిపించిన జాతిపిత మహాత్మా గాంధీ 156వ జయంతి సందర్భంగా ఘన నివాళి అర్పిస్తున్నాను. భరత జాతిని ఏకతాటిపై నడిపించి బ్రిటీష్ సామ్రాజ్యంపై శాంతి, అహింసలతో పోరాడి దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన మహనీయులు గాంధీజీ అని అన్నారు సీఎం చంద్రబాబు.
మేకిన్ ఇండియా ఆమలుకు తొలిసారి ఢిల్లీలో ఎయిర్‌బస్ బోర్డుతో సమావేశం అయినట్లు లోకేశ్ తెలిపారు. ఈ మేరకు ఆయన ఏపీకి రావాలని ఎయిర్‌బస్ ప్రతినిధులను ఆహ్వానం పలికారు.
సోషల్ మీడియా ద్వారా కులాల మధ్య చిచ్చుకు వైసీపీ యత్నిస్తోందని తెలుగుదేశం ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర యాదవ్ విమర్శించారు. కులాల మధ్య చిచ్చు, కుట్రలతో రాజకీయాలు చేద్దామనుకుంటున్న వైసీపీపై ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని రవిచంద్ర యాదవ్ సూచించారు.