Home » Minister Narayana
Andhrapradesh: నెల్లూరు నగరంలోని చేపల మార్కెట్ వద్దా అన్నా క్యాంటిన్‌ను మంత్రి నారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ... ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 99 క్యాంటీన్లు ప్రారంభించామని తెలిపారు. 2014 -19 మధ్య 203క్యాంటీన్లు ప్రభుత్వం మంజూరు చేసిందని... 173 క్యాంటీన్లు అప్పుడు ప్రారంభించామన్నారు.
వైసీపీ ప్రభుత్వంలో చాలా పనులు అసంపూర్తిగా మిగిలిపోయాయని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. ఎమ్మెల్యేలతో కలసి స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు ముందుకు వస్తే, ఆ పనులను పూర్తి చేయడానికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. నెల్లూరు జిల్లాలో 80 శాతం వ్యవసాయ ఆధారిత ప్రాంతమేనని వెల్లడించారు. సోమశిలకు వరద వచ్చి సోమేశ్వర ఆలయం కొట్టుకుపోతే, గత ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందని మండిపడ్డారు.
ప్రజలకు క్యాన్సర్‌పై అవగాహన ఎంతో అవసరమని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖామంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు. 15 ఆగస్టు నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితంగా నిర్వహించనున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు.
వైసీపీ(YSRCP) హయాంలో తీవ్ర స్థాయిలో ప్రజాధనం దుర్వినియోగం జరిగిందని మంత్రి నారాయణ(Minister Narayana) ఆరోపించారు. ఇందుకు కారణమైన వారిని ఎట్టిపరిస్థితుల్లో విడిచిపెట్టేది లేదని స్పష్టం చేశారు.
Andhrapradesh: రాజధాని అమరావతిలో జంగిల్ క్లియరెన్స్ పనులు ప్రారంభమయ్యాయి. బుధవారం ఉదయం మునిసిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ పూజ చేసి మరీ జంగిల్ క్లియరెన్స్ పనులను స్వయంగా మొదలుపెట్టారు. దీంతో వాటిని శుభ్రం చేసే పనులు ఈరోజు నుంచి మొదలయ్యాయి. మొత్తం 58 వేల ఎకరాల్లో ఉన్న తుమ్మ చెట్లు, ముళ్ల కంపలను నెలరోజుల్లోగా తొలగించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.
అన్న క్యాంటీన్లను ఆగస్టు15వ తేదీన ఒకేసారి ప్రారంభిస్తామని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ (Minister Narayana) కీలక ప్రకటన చేశారు. 100 అన్న క్యాంటీన్లను ప్రారంభిస్తామని వెల్లడించారు.
టౌన్ ప్లానింగ్‌లో స్పెషల్ డ్రైవ్ నిత్యం కొనసాగుతుందని పురపాలక శాఖ మంత్రి నారాయణ (Minister Narayana) తెలిపారు. అన్ని అనుమతులు ఉండి నిర్మాణానికి నోచుకోని పెండింగ్ పనులపై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నామని చెప్పారు.
రోడ్లు, డివైడర్లలో ఫ్లెక్సీలను తొలగించాలని మంత్రి నారాయణ (Minister Narayana) ఆదేశించారు. వ్యాధులు ప్రబలకుండా తాగునీటి పరీక్షలు చేయాలని అన్నారు. త్వరగా అన్న క్యాంటీన్ల నిర్మాణాలు పూర్తి చేయాలని చెప్పారు.
విశాఖ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ప్రాజెక్టు పనులపై ఇంజినీరింగ్ అధికారులు, కాంట్రాక్టు కంపెనీల ప్రతినిధులతో మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరి నారాయణ సమావేశం నిర్వహించారు. మొదటి ఫేజ్‌లో భాగంగా పెందుర్తి, రెండో ఫేజ్‌లో గాజువాక, మల్కాపురం ప్రాంతాల్లో యూజీడీ పనులు చేయనున్నారు.
‘రాష్ట్రంలోని 106 మున్సిపాలిటీల్లో డ్రైన్ల పూడికతీత పనులకు రూ.50 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. ఆ నిధులను నిర్దేశిత పనులకు మాత్రమే వినియోగించాలి. తీసిన పూడికను 24 గంటల్లో తరలించాలి.