Home » Minister Satya Kumar
జాతీయ మానవ హక్కుల కమిషన్ చేసిన సూచనలను అనుసరించి డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ చట్టం - 1986కు సవరణను ఏపీ అసెంబ్లీ ఆమోదించింది.
ఏపీలో మరో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఈ స్కాం పై అసెంబ్లీలో చర్చ జరిగింది. మంత్రి సత్యకుమార్ యాదవ్ అరబిందో సంస్థపై సంచలన ఆరోపణలు చేశారు. 108 సేవ ముసుగులో భారీ దోపిడీకి పాల్పడిందని ఆరోపించారు.
శాసన మండలి నుంచి వైసీపీ సభ్యులు వాకౌట్ చేశారు. మంత్రి సత్య కుమార్ సమాధానానికి వ్యతిరేకంగా వైసీపీ సభ్యులు వాకౌట్ చేశారు. పులివెందులపై ఉన్న శ్రద్ధ రాయలసీమలోని ఇతర కాలేజ్లపై ఎందుకు లేదో వైసీపీ సభ్యులు చెప్పాలని మంత్రి ప్రశ్నించారు.
Andhrapradesh: గత మూడు రోజులుగా మంత్రులు లోకేష్ , నారాయణ, సత్యకుమార్ ఢిల్లీలోనే ఉన్నారు. ఇందులో భాగంగా పలువురు కేంద్రమంత్రులను, మంత్రిత్వశాఖల ఉన్నతాధికారులను మంత్రులు కలుస్తున్నారు. నిన్న (సోమవారం) హడ్కో అధికారులతో ఏపీ పట్టణాభివృద్ధి, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ భేటీ అయ్యారు.
ఆరోగ్య శాఖపై మంత్రి సత్యకుమార్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆయుష్మాన్ భారత్ అమలు తీరు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పని విధానంపై సమగ్ర వివరాలు తెలుసుకున్నారు. రాష్ట్రంలో కూటమి పార్టీల మధ్య సమన్వయం జరుగుతున్న విధానాన్ని అమిత్ షాకు వివరించారు.
Andhrapradesh: ఢిల్లీలో మంత్రి లోకేష్ బిజీగా ఉన్నారు. ఈరోజు (సోమవారం) ఎలక్ట్రానిక్స్ రంగంలో అగ్ర సంస్థలతో మంత్రి లోకేష్ భేటీ కానున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు అగ్ర సంస్థలకు వివరించి వారిని రాష్ట్రానికి ఆహ్వానించనున్నారు. అలాగే పలువురు కేంద్ర మంత్రులను కూడా కలిసే అవకాశం ఉంది.
Andhrapradesh: సామాన్యుడికి అందుబాటులో ఉండేలా ఓ ప్రత్యేక బ్రాండ్ను తీసుకొస్తున్నామని మంత్రి కొల్లురవీంద్ర అన్నారు. టూరిజం పాలసీలో 3, 4 నక్షత్రాల హోటళ్లలో అధికంగా వసూలు చేస్తున్నారనే రోపణలు వచ్చాయన్నారు.
న్యూఢిల్లీ: ఇటువంటి అసమర్థ వ్యక్తి వైఎస్ జగన్ సీఎం ఎలా అయ్యారని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. నరేంద్రమోదీ ప్రభుత్వం మంజూరు చేసిన 17 మెడికల్ కాలేజీల నిర్మాణం మొదలుపెట్టి నాలుగేళ్లు నిండాయని, ఇప్పటికీ పూర్తిగా నిర్మాణం అయ్యింది ఒక్కటి లేదని, సగం పైగా పునాదుల దశలోనే ఉన్నాయని విమర్శించారు.
Andhrapradesh: గత ప్రభుత్వంలో 8,840 కోట్లు వైద్య కళాశాల నిర్మాణానికి ఖర్చు చేయాల్సి ఉందని... కానీ 2120 కోట్లు మాత్రమే ఖర్చు చేరాని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ అన్నారు. దాంట్లో కూడా 700 కోట్లు బకాయిలు పడ్డారని తెలిపారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. పులివెందులలో సీట్లు అడ్డుకున్నారని ఆరోపణలు చేస్తున్నారన్నారు.
వరద బాధితులకు అందుతున్న వైద్య సేవలపై మంత్రి సత్య కుమార్ యాదవ్ ఆరా తీశారు. వరద ముంపు ప్రాంతాలైన ప్రజాశక్తి నగర్ , ఎన్ఎస్సీ బోస్ రోడ్డులోని ఉచిత వైద్య శిబిరాలు, 104 సంచార వాహనాలను మంత్రి సత్యకుమార్ ఈరోజు(ఆదివారం) సందర్శించారు.