Home » Minister Seethakka
పేదోడి ఆలోచనకు అనుగుణంగా గాంధీనగర్ ఇండస్ట్రీయల్ పార్కు ఏర్పాటు చేస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Minister Ponguleti Srinivasa Reddy) తెలిపారు. ప్రజల దీవెనలతో రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో ఇందిరమ్మ రాజ్యం వచ్చిందని చెప్పారు. అభివృద్ధి , సంక్షేమం తమ ప్రభుత్వానికి రెండు రెండు కళ్లు, జోడెడ్ల లాగా సాగుతున్నాయని తెలిపారు.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఏడో రోజూ హాట్ హాట్‌గానే సాగుతున్నాయి. ద్రవ్య వినిమయ బిల్లును డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టగా.. అది కాస్త ఎక్కడెక్కడికో పోయింది.
‘పోడు భూములకు హక్కుల కోసం పోరాడిన నా తండ్రి జైలుకు పోయొచ్చిండు.. నేను ఎమ్మెల్యేనైనా.. ఇప్పుడు మంత్రిగా ఉన్నా.. నా తల్లిదండ్రులు రెక్కలుముక్కలు చేసుకొని కష్టపడుతరు.. ఇప్పటికీ నా తండ్రి అడవినే నమ్ముకొని రోజూ పనిచేస్తడు..’
హైదరాబాద్: 10 ఏళ్ల తర్వాత అసెంబ్లీలో ప్రజా స్వామ్యం కనిపిస్తుందని, బీఆర్ఎస్ హయం లో శాసనసభలో ప్రొటెస్ట్ చేస్తే సస్పెండ్ చేసే వారని, తెలంగాణ ఏర్పడిందే నియామకాల మీదని .. అలాంటి నియామకాలపై అధికారంలో వున్నపుడు బీఆర్ఎస్ స్పందించలేదని మంత్రి సీతక్క ఆరోపించారు.
రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాల్లో పనిచేసే టీచర్లు, ఆయాలకు ఉద్యోగ విరమణ ప్రయోజనాలు అందించనున్నట్లు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తెలిపారు. దీంతో టీచర్లకు రూ.2 లక్షలు, ఆయాలకు రూ.లక్ష వరకు లబ్ధి చేకూరుతుందని పేర్కొన్నారు.
నగరంలో ఏర్పాటు చేసిన "రణధీర సీతక్క"(Randheera Seethakka) పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క పాల్గొన్నారు. సీతక్క జీవిత నేపథ్యంతో అస్నాల శ్రీనివాస్ పుస్తకాన్ని రచించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క తన జీవిత విశేషాలను తలచుకుని భావోద్వేగానికి లోనయ్యారు.
తెలంగాణలో రోడ్డు సౌకర్యం లేని మారుమూల ప్రాంతాలు, ఏజెన్సీ గ్రామాల్లో రోడ్ల నిర్మాణం కోసం నిధులు కేటాయించాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌కు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క విజ్ఞప్తి చేశారు.
ములుగు జిల్లా: రాష్ట్రవ్యాప్తంగా అధికార కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ ఎన్నికల ప్రచారం ముమ్మరం చేసింది. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి జోరుమీదున్న కాంగ్రెస్, సార్వత్రిక ఎన్నికల్లోనూ సత్తా చాటాలని గట్టిగా కృషిచేస్తోంది. ఈ క్రమంలో గిరిజన సంక్షేమశాఖ మంత్రి సీతక్క ములుగు జిల్లా, వెంకటాపురం మండలం, నల్లగుంటలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.
ఆదిలాబాద్: మంత్రి సీతక్క మంగళవారం ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. కెరమెరి మండలం, గొందిలో జంగు బాయిని మంత్రి దర్శించుకోనున్నారు. అనంతరం అభివృద్ధి పనులపై ఉట్నూర్ కేబి కాంప్లెక్స్‌లో ఉమ్మడి జిల్లా అధికారులతో సమీక్ష చేయనున్నారు.
రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత తొలిసారిగా ములుగు(Mulugu) నియోజకవర్గానికి వచ్చారు సీతక్క(Minister Seethakka).