Home » MLA
తనపై చేసిన లైంగిక ఆరోపణను ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ తీవ్రంగా ఖండించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తనపై కేజీబీవీ ప్రిన్సిపాల్ సౌమ్య అసత్య ఆరోపణలు చేశారన్నారు. ఆమె చేసిన ఆరోపణలు సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉన్నాయని తెలిపారు.
రైతుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ పే ర్కొన్నారు. ఆయన ఆదివారం మండలంలోని చెర్లోపల్లి రిజర్వాయర్ నుం చి పుంగనూరు బ్రాంచ కెనాల్‌కు మాజీ ఎమ్మెల్యే ఎంఎస్ పార్థసారఽథి, జనసేన పార్టీ నియోజకవర్గ ఇనచార్జ్ భైరవప్రసాద్తో కలిసి నీటిని విడుదల చేశారు.
‘‘రైతు కుటుంబం నుంచి వచ్చిన నాకు అభివృద్ధి తప్ప రాజకీయాలు చేయడం తెలియదు. సీఎం చంద్రబాబు ఆశీర్వాదం, మా యువనేత లోకేశ్ సహకారంతో ఎమ్మెల్యే అయ్యానని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అన్నారు.
‘‘దగ్గుపాటీ.. నోరు అదుపులో పెట్టుకో. దమ్ము ధైర్యం ఉంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిరా.. పోటీ చేద్దాం. ఎవరికి ఎన్ని ఓట్లు వస్తాయో చూద్దాం... అంటూ మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి సవాల్ విసిరారు.
ముట్టుకుంటే పడిపోయే స్థితిలో ఉన్న రంగానగర్ వాంబే ఇళ్లను త్వరలో కూల్చివేసి కొత్తవి నిర్మించి ఇస్తామని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ బాధితులకు హామీ ఇచ్చారు. మంగళవారం రంగానగర్ వాంబే ఇళ్ల బాధితుల ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యే సికింద్రాబాద్, ముషీరాబాద్ తహసీల్దార్, అధికారులతో కలిసి ఇళ్లను పరిశీలించారు.
నాయీబ్రాహ్మణుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేసిందని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ కమిటీ ఇచ్చిన నివేదిక తప్పుల తడకని, బీఆర్ఎస్ పార్టీని, మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావులను అప్రదిష్ట పాల్జేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు.
అక్రమార్కులెవరూ తప్పించుకోలేరని ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి అన్నారు. పట్టణంలోని ఆయన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. ఎమ్మిగనూరు పట్టణంలో 2008లో మంజూరై 2009లో అప్పటి ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి హయాంలో రూ. 44కోట్లతో ప్రారంభమై నేటికి అసంపూర్తిగా ఉన్న యూజీడీ(అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ)లో జరిగిన అక్రమాలపై విచారణ కమిటీ వేస్తామన్నారు.
నాగోల్ బండ్లగూడలో రామాలయ పునర్నిర్మాణ పనులను ప్రైవేటు వ్యక్తులు అడ్డుకోవాలని చూస్తే కఠిన చర్యలు తప్పవని ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి హెచ్చరించారు. ఆలయ పునర్నిర్మాణపనులు చేపడుతుంటే పక్కనే ఉన్న ఓ ప్రైవేటు వ్యక్తి ఆలయం మధ్యలోంచి దారి వదలాలంటూ పలు రకాలుగా ఇబ్బందులు పెడుతున్నాడని ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు.
రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు.