Home » MLC Kavitha
కామారెడ్డి బీసీ డిక్లరేషన్ను తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. రానున్న స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసి ఎన్నికలు నిర్వహించాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆమె కోరారు.
MLC KAVITHA: మహిళలకు రాష్ట్రంలో రక్షణ లేకుండా పోయిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో ఇసుక అక్రమ వ్యాపారం.. గుట్కా దందా యథేచ్ఛగా సాగుతోందన్నారు. తెలంగాణ యూనివర్సిటీకి వెంటనే నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బోధన్ నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తామని చెప్పిన వారు కమిటీల పేరిట కాలయాపన చేస్తున్నారని కవిత మండిపడ్డారు.
BANDI SANJAY: విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా రేవంత్ ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ ప్రశ్నించారు. 6 గ్యారెంటీలను పూర్తిగా అమలు చేయడంలో రేవంత్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విమర్శించారు. కాంగ్రెస్ సర్కార్ దిగొచ్చే వరకు ఆందోళన చేస్తామని బండి సంజయ్ కుమార్ వార్నింగ్ ఇచ్చారు.
చాలా కాలం తర్వాత నిజామాబాద్కు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత వస్తున్నారు. కాగా ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్టు అయి, ఆరు నెలలు తిహార్ జైలులో ఉన్న అనంతరం మొదటి సారి జిల్లాకు వస్తున్నారు. డిచ్పల్లి వద్ద బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కవితకు ఘనస్వా గతం పలుకుతారు. బై పాస్ రోడ్డు మీదుగా సుభాష్ నగర్, ఎస్ఎఫ్ఎస్ సర్కిల్ వరకు బీఆర్ఎస్ కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహిస్తారు.
Telangana: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కల్వకుంట్ల కవిత నాయకత్వంలో బీసీల సమస్యలను పరిష్కరించుకొనే కర్మ తమకు పట్టలేదన్నారు. కవిత నాయకత్వం బీసీలకు అవసరం లేదన్నారు. పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు బీసీల గురించి ఏనాడైనా కవిత మాట్లాడారా? అని నిలదీశారు.
Telangana: రాష్ట్ర ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. అందరి కోసం కాకుండా.. కొందరి కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని విమర్శించారు. రేవంత్ రెడ్డి పెద్దల కోసమే ప్రభుత్వాన్ని నడుపుతున్నారని ఆరోపించారు.
రుణమాఫీపై సీఎం రేవంత్ ఇచ్చిన హామీలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తీవ్ర విమర్శలు గుప్పించారు. దేవుళ్ల సాక్షిగా హామీ ఇచ్చి మరిచారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లి తెలంగాణకు ఏం సాధించారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. నెలకు రెండుమూడు సార్లు ఢిల్లీకి వెళ్లి సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రులను కలిశారని.. మరి ప్రతి జిల్లాకు రావాల్సిన నవోదయా విద్యాలయాలను ఎన్ని సాధించారని కవిత ప్రశ్నించారు.
జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్కు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. కేసీఆర్ బొమ్మతో గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి ఎలా వెళ్లారని ప్రశ్నించారు. నియోజకవర్గ అభివృద్ధికి ఎలాంటి నిధులు తెచ్చారని కవిత ప్రశ్నించారు.
తెలంగాణ జాగృతి సంస్థ వ్యవస్థాపకురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆదివారం జగిత్యాలలో పర్యటించనున్నారు. దరూర్ ఎస్సారెస్పి కెనాల్ అంబేద్కర్ విగ్రహం వద్ద క్యాడర్ను ఉద్దేశించి కవిత ప్రసంగిస్తారు.