Home » Mulugu
ములుగు జిల్లా, వాజేడు మండలం ఎస్ఐ రుద్రారపు హరీష్ ఆత్మహత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇంట్లో వేరే పెళ్లి సంబంధం చూస్తుండడంతో ఎస్ఐ మనస్థాపానికి గురయ్మారు. పెళ్లి వ్యవహారంతోనే మనస్థాపానికి గురై గన్తో కాల్చుకొని చనిపోయారు. దీంతో ఎస్ఐ హరీష్ స్వంత గ్రామం గొరికొత్తపల్లి మండలం, వెంకటేశ్వర్లుపల్లిలో విషాదం నెలకొంది.
ములుగు జిల్లా: వాజేడు మండలం ఎస్ఐ రుద్రారపు హరీష్ ఆత్మహత్య చేసుకున్నారు. ఎస్ఐ నిన్న (ఆదివారం) రిసార్ట్స్లో గది అద్దెకు తీసుకుని ఉన్నారు. ఎవరు ఫోన్ చేసిన ఆయన అందుబాటులోకి రాలేదు. ఆయన ఆత్మహత్యకు ఇంట్లో కుటుంబ కలహాలు, వ్యక్తిగత కారణంగా సమాచారం. రిసార్ట్స్ సిబ్బంది ఎన్ని సార్లు డోర్ కొట్టినా తలుపు తెరవలేదు.
ములుగు ఏజన్సీలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఒకవైపు మావోయిస్టుల ఎన్కౌంటర్.. మరోవైపు సోమవారం నుంచి మావోయిస్టుల పీఎల్జీఏ వారోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు అప్రమత్తం అయ్యారు. ముమ్మరంగా కూంబింగ్ చేపట్టారు. మావోయిస్టుల ప్రభావిత ప్రాంతాల్లో అభివృద్ధి పనులను నిలిపివేశారు.
ములుగు జిల్లా ఏటూరు నాగారం అడవుల్లో మరోమారు తుపాకీ గర్జించింది. ఆదివారం తెల్లవారుజామున జరిగిన భారీ ఎన్కౌంటర్లో ఏడుగురు మావోయిస్టులు మృతిచెందారు.
తెలంగాణలో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఏటూరు నాగారం మండలం ఏజెన్సీ అడవుల్లో ఇవాళ(ఆదివారం) ఉదయం భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఎదురుకాల్పుల్లో ఏడుగురు మావోలు మృతిచెందారు. చల్పాక అటవీ ప్రాంతంలో గ్రేహౌండ్స్ బలగాలు, మావోయిస్టుల మధ్య భీకర కాల్పులు జరిగాయి.
ఎదురు కాల్పుల్లో మృతిచెందిన ఏడుగులు మావోయిస్టుల మృతదేహాలను పోలీసులు ట్రాక్టర్లలో ఏటూరు నాగారం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వారి మృతదేహాలకు మరికాసేపట్లో పోస్టుమార్టం నిర్వహించనున్నారు. మృతిచెందిన మావోయిస్టుల వివరాలను పోలీసులు వెల్లడించారు.
ములుగు నియోజకవర్గంలో కొత్తగా మల్లంపల్లి మండలం ఏర్పాటు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. మల్లంపల్లి మండలం ఏర్పాటు చేస్తూ రెవెన్యూ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల్లో ఇచ్చిన మాటను పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క నిలబెట్టుకున్నారు.
కొంతకాలంగా వరుసగా ఎదురుదెబ్బలు తింటున్న మావోయిస్టులు గురువారం రాత్రి ఇద్దరు వ్యక్తుల్ని హతమార్చి ఒక్కసారిగా అలజడి సృష్టించారు.
దేశంలో మావోయిస్టులను నిర్మూలించేందుకు కేంద్ర ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. అందులోభాగంగా 2026, మార్చిలో నెలలోపు దేశంలో మావోయిస్టులు లేకుండా చేయాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ద్వయం లక్ష్యంగా నిర్దేశించుకున్నారు.
పొలంలో విద్యుదాఘాతం, పాము కాటుకు గురై ఇద్దరు రైతులు ప్రాణాలు కోల్పోయారు. సూర్యాపేట జిల్లా మద్దిరాల మండల కేంద్రానికి చెందిన భూతం వెంకన్న, సుభద్ర దంపతుల మూడో కుమారుడు