Home » Mulugu
మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు తక్కళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న ఛత్తీ్సగఢ్లోని నారాయణపూర్ - దంతెవాడ జిల్లాల సరిహద్దులోని అబూజ్మడ్లో జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ములుగు జిల్లా: గొల్లాల గుడిలో గుప్తనిధుల తవ్వకాలు జరిగినట్లు ఆదివారం వెలుగులోకి వచ్చింది. గుడి పైకప్పు తొలగించడంతో శిఖరం దెబ్బతింది. పైకప్పులో వికసించే తామరపువ్వు గుర్తుతో ఉన్న శిల్పాన్ని దుండగులు పూర్తిగా ధ్వంసం చేసి ఆలయ పరిసరాల్లో పడేశారు. శివలింగం ఒకవైపు ఒరిగినట్లు కనిపిస్తోంది.
ఇంత పెద్ద విధ్వంసం చోటు చేసుకున్నా.. భారీ వృక్షాలు నేలకొరిగినా.. అక్కడి జంతువులకు, పక్షులకు హానీ జరిగినట్లు ఆనవాళ్లేవీ కనిపించలేదు. ఇంత పెద్ద విపత్తులోనూ ఒక్క జంతువు గానీ, ఒక్క పక్షి గానీ గాయపడినట్లు, చనిపోయినట్లు వెలుగుచూడలేదని..
సామాజిక న్యాయం జరగాలంటే పేదరికంపై యుద్ధం జరగాలని, విద్యతోనే పేదరిక నిర్మూలన సాధ్యమని మంత్రి సీతక్క అన్నారు.
ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలో వరస అత్యాచారాలు చేస్తూ శివకుమార్ అనే కామాంధుడు హడలెత్తిస్తున్నాడు. శనివారం రాత్రి ఓ వృద్ధురాలి ఇంట్లోకి చొరబడి ఆమెపై అత్యాచారం చేశాడు. దీంతో గ్రామస్థులంతా వెంకటాపూర్ పోలీస్ స్టేషన్ ఎదుట భైఠాయించి అతణ్ని కఠినంగా శిక్షించాలంటూ నిరసన తెలుపుతున్నారు.
మేడారం అభయారణ్యంలో సుడిగాలుల ప్రభావానికి 205 హెక్టార్లలో వృక్ష సంపద ధ్వంసమైన ఘటనను మరువక ముందే ఏటూరునాగారం మండలంలోనూ అదే తీరులో భారీగా వృక్షాలు నేలకూలాయి.
Telangana: మేడారంలో 500 ఎకరాల్లో చెట్లు నేలకొరగడంపై మంత్రి సీతక్క ఆరా తీశారు. రాష్ట్ర సచివాలయం నుంచి పీసీసీఎఫ్, డీఎఫ్ఓలతో టెలిఫోన్లలో మంత్రి మాట్లాడారు. రెండు రోజుల క్రితమే చెట్లు నేలకొరిగిన ప్రాంతాన్ని సీతక్క సందర్శించారు. లక్ష చెట్ల వరకు నేలకూలడం పట్ల మంత్రి విస్మయం చెందారు. ఈ స్థాయిలో అటవీ విధ్వంసం జరగడం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
వ్యవసాయ రంగంలో సౌర పంపు సెట్ల వాడకాన్ని ప్రోత్సహించాలని, రైతుల సుస్థిరాభివృద్ధిపై అధికారులు దృష్టి సారించాలని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సూచించారు.
ఉమ్మడి వరంగల్(Warangal) జిల్లా మూడ్రోజుల పర్యటనలో భాగంగా తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ(Jishnu Dev Varma) నేడు(మంగళవారం) ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో పర్యటించనున్నారు. ముందుగా ఆయన యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుంటారు.
మద్యంమత్తులో తండ్రే కూతుర్ని విక్రయించిన ఘటన ములుగు జిల్లా నూగురు వెంకటాపురం(Nuguru Venkatapuram)లో చోటు చేసుకుంది. తాగిన మైకంలో కన్న తండ్రే ఓ చిన్నారిని అమ్మిన ఘటన హృదయాల్ని కలచివేస్తోంది.