Home » Mumbai Indians
కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, స్టార్ బ్యాటర్ శివమ్ దూబే అద్భుతంగా రాణించడం, చివరిలో ఎంఎస్ ధోనీ మెరుపులు మెరిపించడంతో ప్రత్యర్థి ముంబై ఇండియన్స్‌కు చెన్నై సూపర్ కింగ్స్ భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి చెన్నై స్కోరు 206 పరుగులుగా నమోదయింది.
గత రెండు మ్యాచ్‌ల్లో ఓటములు చవిచూసిన పంజాబ్ కింగ్స్‌కు తాజాగా ఊహించని షాక్ తగిలింది. ఆ జట్టు కెప్టెన్ శిఖర్ ధవన్ రెండు వారాల పాటు క్రికెట్‌కు దూరం కానున్నాడు. ఒకట్రెండు మ్యాచ్‌లకు ధవన్ అందుబాటులో ఉండడని ఆ జట్టు క్రికెట్ డెవలప్మెంట్ హెడ్ సంజయ్ భంగార్ పేర్కొన్నాడు.
ఐపీఎల్ 2024(ipl 2024)లో ముంబై ఇండియన్స్(Mumbai Indians), చెన్నై సూపర్ కింగ్స్(chennai super kings) జట్లు ఆదివారం రాత్రి 7.30 గంటలకు తలపడనున్నాయి. ముంబై(mumbai)లోని వాంఖడే స్టేడియంలో ఇరు జట్ల మధ్య ఈ మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్‌కు ముందు ముంబై ఇండియన్స్ ఆటగాడు రోహిత్ శర్మ(Rohit Sharma)కు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఐపీఎల్ 2024లో (IPL 2024) భాగంగా గురువారం ముంబై ఇండియన్స్ (Mumbai Indians), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మధ్య జరిగిన మ్యాచ్‌లో టాస్ ట్యాంపరింగ్ (Toss Tampering) జరిగిందా? అని సందేహం కలిగించేలా సోషల్ మీడియాలో వీడియో చక్కర్లు కొడుతున్నాయి. క్రికెట్ ఫ్యాన్స్ గుర్తించిన ఈ పరిణామం ఆసక్తికరంగా మారింది.
ఐపీఎల్ 2024లో ముంబై ఇండియన్స్ ఇటీవలనే గెలుపు బాట పట్టింది. ఆరంభంలో హ్యాట్రిక్ ఓటములతో డీలా పడిన ముంబై నాలుగో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై విజయంతో ఫామ్‌లోకి వచ్చింది. ఈ క్రమంలో ఐదో మ్యాచ్‌కు సిద్ధమవుతోంది. ఇక వరుసగా విజయాలు సాధించి ప్లేఆఫ్స్‌కు దూసుకెళ్లాలని భావిస్తోంది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 (ఐపీఎల్ 2024) రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌లన్నీ క్రికెట్ అభిమానులకు ఫుల్ మాజా పంచాయి. దీంతో రానున్న రోజుల్లో జరిగే మ్యాచ్‌లపై మరింత ఆసక్తి నెలకొంది. ఆదివారం జరిగిన డబుల్ హెడ్డర్ మ్యాచ్‌లు అభిమానులను అలరించాయి.
ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా మొదటి రెండు మ్యాచ్‌ల్లో బౌలింగ్ వేశాడు కానీ, ఆ తర్వాతి రెండు మ్యాచ్‌ల్లో మాత్రం బంతిని ముట్టలేదు. ఒక్కటంటే ఒక్క ఓవర్ కూడా వేయలేదు. దీంతో.. హార్దిక్ ఎందుకు బౌలింగ్ వేయలేదన్న విషయం హాట్ టాపిక్‌గా మారింది.
వండర్స్ క్రియేట్ చేయడంలో ఎప్పుడూ ముందుండే ముంబై ఇండియన్స్ జట్టు తాజాగా ఓ చారిత్రాత్మక రికార్డ్‌ని నమోదు చేసింది. టీ20 క్రికెట్ చరిత్రలో (ఐపీఎల్, సీఎల్టీ20తో కలిపి) 150 విజయాలు సాధించిన మొట్టమొదటి జట్టుగా సంచలన రికార్డ్‌ని సృష్టించింది.
ఐపీఎల్ 2024లో ముంబై ఇండియన్స్ బోణీ చేసింది. హ్యాట్రిక్ ఓటముల తర్వాత తమ స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చిన ముంబై.. ఢిల్లీ క్యాపిటల్స్‌పై 29 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో ఈ సీజన్లో తొలి విజయం నమోదు చేసింది.
ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ బ్యాటర్లు ఊచకోత కోశారు. ఢిల్లీ బౌలర్లను ఊతికారేస్తూ బ్యాటింగ్ పిచ్‌పై పరుగుల వరద పారించారు. రోహిత్ శర్మ(49), ఇషాన్ కిషన్(42), టిమ్ డేవిడ్ (45), రొమారియో షెపర్డ్(39) విధ్వంసకర బ్యాటింగ్‌తో పరుగుల దుమ్ములేపారు.