Home » Nadendla Manohar
Andhrapradesh: ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పేద ప్రజలకు పెద్ద పండుగ అని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ... రైతులను కలిసిన సమయంలో వారి బాధలు చెప్పారన్నారు. ధాన్యం కొనుగోలు లో కూడా రైతుకు అన్యాయం జరుగుతుందన్నారు.
పౌరసరఫరాల శాఖలో అవినీతి, అక్రమాల నియంత్రణపై ప్రత్యేక దృష్టిపెట్టినట్లు ఆ శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్(Minister Nadendla Manohar) తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వంలో పేదలకు అందించిన రేషన్ సరకుల్లో జరిగిన వేల కోట్ల రూపాయల అవినీతి తెలుసుకుని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇటీవల ఆకస్మిక తనిఖీలతో అధికారులను పరుగులు పెట్టించిన మంత్రి.. ప్రజలకు ఇచ్చే పంచదార, కందిపప్పు, నూనె వంటి ప్యాకెట్ల తూకంలో తేడాలు గుర్తించి పంపిణీని ఆపేశారు.
‘కాకినాడ కేంద్రంగా వ్యవస్థీకృతమైన రేషన్ బియ్యం మాఫియాలో మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్రెడ్డి కుటుంబం ఉంది. పోర్టును ఆక్రమించి భారీ అక్రమాలకు పాల్పడింది.
గొల్లపూడి(Gollapudi) మండల్ లెవల్ స్టాక్(MLS)పాయింట్ను పౌరసరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్(Minister Nadendla Manohar) ఆకస్మిక తనిఖీ చేశారు. రేషన్ సరకుల్లో(Ration Goods) నాణ్యతా లోపం, పరిమాణం తగ్గిన ప్యాకింగ్పై ఆయన మండిపడ్డారు.
రాష్ట్ర ప్రజలు ఏదైతే మార్పు కోరుకున్నారో.. అందుకనుగుణంగా నిజాయితీగా, చట్టప్రకారం కార్యక్రమాలు చేస్తూ ముందుకు సాగుతామని, ప్రజలను మోసం చేసి, ఇబ్బందులు పెట్టే కార్యక్రమాలను సహించబోమని రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్లో నూతనంగా కూటమి ప్రభుత్వం కొలువైన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు, డిప్యూటీ సీఎంగా కొణిదెల పవన్ కల్యాణ్, మంత్రుగులుగా పలువురు ప్రమాణ స్వీకారం చేశారు. వీరిలో ఇప్పటికే కొందరు మంత్రులుగా బాధ్యతలు స్వీకరించగా..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chandrababu).. డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కల్యాణ్ (Pawan Kalyan) మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ భేటీకి సచివాలయం వేదిక అయ్యింది..
రేషన్ సరఫరాలో అక్రమాలకు తావు లేదని.. అక్రమాలకు పాల్పడిన ఎవరిని వదలిపెట్టబోనని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) వార్నింగ్ ఇచ్చారు. లీగల్ మెట్రాలజీ విభాగం అధికారులతో సమీక్ష సమావేశం జరిపినట్లు తెలిపారు.
: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ క్యాంపు కార్యాలయం ఖరారు కావాల్సి ఉంది. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లిన జనసేనాని నేరుగా జలవనరుల శాఖ క్యాంపు కార్యాలయం పరిశీలించారు. తన కోసం ఏర్పాటు చేసిన క్యాంపు కార్యాలయాన్ని పవన్ కల్యాణ్ నిశీతంగా పరిశీలించారు. ఆ కార్యాలయాన్ని జనసేన ముఖ్య నేత నాదెండ్ల మనోహర్ పరిశీలించారు.