Home » Nagarjuna Sagar
నాగార్జున సాగర్, శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌లో గతంలో అంటే.. 2018లో 68 పులులు ఉన్నాయి. తాజా లెక్కల ప్రకారం.. వాటి సంఖ్య 90 నుంచి 95కు పెరిగింది. 2025 నాటికి ఈ పులుల సంఖ్య 100 దాటుతుందని అధికారులు అటవీశాఖ అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
కృష్ణా బేసిన్లో కురుస్తున్న వర్షాల వల్ల కృష్ణా, తుంగభద్ర నదులకు స్వల్పంగా వరద ప్రవాహం కొనసాగుతోంది.
ఖమ్మం సాగర్ కెనాల్లో పడి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం బాపణకుంటకు చెందిన ముగ్గురు వ్యక్తులు గల్లంతయ్యారు. వీరంతా గంజాయి కేసులో బెయిల్ కోసం వెళ్లగా ప్రమాదవశాత్తూ కాలువలో పడి గల్లంతయ్యారు.
శ్రీశైలం జలాశయంలో నీటి నిల్వలు మళ్లీ క్రమంగా పెరుగుతున్నాయి. కొన్ని రోజులుగా సాగు, జలవిద్యుత్ అవసరాలకు అడ్డదిడ్డంగా నీటిని ఇరు రాష్ట్రాలు తరలించడంతో రిజర్వాయర్‌లో నిల్వలు గణనీయంగా తగ్గిపోయాయి.
కృష్ణా బేసిన్లో వరద తగ్గుముఖం పట్టడంతో.. ప్రాజెక్టుల గేట్లు బంద్ అయ్యాయి.
పర్యాటక కేంద్రమైన నాగార్జునకొండ బౌద్ధమత ఆనవాళ్లకు నెలవని హైకోర్టు న్యాయమూర్తి సృజన అన్నారు.
నాగార్జునసాగర్ జలాశయంలో నీరు పుష్కలంగా ఉన్నందున.. నిరంతరాయంగా విద్యుదుత్పత్తి చేపట్టాలని జెన్కో సీఎండీ రోనాల్డ్‌రాస్ ఆదేశించారు.
కృష్ణా బేసిన్లో కురుస్తున్న వర్షాలకు మళ్లీ వరదలు ప్రారంభమయ్యాయి. దాంతో వచ్చిన నీటిని వచ్చినట్లే దిగువకు వదులుతున్నారు.
కృష్ణా బేసిన్లో ప్రాజెక్టులకు వరద తగ్గుముఖం పట్టింది. దీంతో శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టుల గేట్లన్నీ మూసివేశారు.
వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రాజెక్టులకు పెద్దఎత్తున వరదనీరు పోటెత్తింది. వర్షాలు కాస్త తగ్గుముఖం పట్టడంతో కొంత మేర నదులు శాంతించాయి. ప్రస్తుతం ప్రాజెక్టుల వద్ద తాజా పరిస్థితి ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..