Home » Nalgonda News
రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నుంచి ప్రజలను కాపాడేందుకు అప్రమత్తంగా ఉండాలని, సైన్యాన్ని, హెలికాప్టర్లను అందుబాటులోకి తేవాలని మాజీ మంత్రి హరీశ్ రావు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.
జిల్లాలోని మిర్యాలగూడ మండలం ఐలాపురంలో దారుణం వెలుగు చూసింది. తల్లితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని బాబాయిని హత్య చేశారు అక్క, తమ్ముడు. హత్య చేసిన అనంతరం ఎవరికీ అనుమానం రాకుండా మృతదేహాన్ని ఖననం చేశారు.
కారు డ్రైవర్ నిద్రమత్తు ఒకరి ప్రాణం తీసింది. మరో ఇద్దర్ని తీవ్ర గాయాలపాల్జేసింది. పోలీసులు స్థానికుల వివరాల ప్రకారం..
సాధారణంగా తరగతికి ప్రవేశం పొందే విద్యార్థికి కింది తరగతుల అభ్యసన సామర్ధ్యాలు ఉండాలి. అయితే కొందరు విద్యార్థులకు అభ్యసన సామర్ధ్యాలు లేకుండానే పైతరగతుల్లో ప్రవేశం పొందుతున్నట్టు విద్యాశాఖ గుర్తించింది. ఈ పరిస్థితులను అధిగమించేందుకు విద్యాశాఖ లెర్నింగ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రాం(లి్ప)ను అమలు చేస్తోంది. ఉమ్మడి జిల్లాలోని అన్ని మేనేజ్మెంట్ల పరిధిలోని పాఠశాలలో 6 నుంచి 9వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు ప్రత్యేక అభ్యసన కార్యక్రమం అమలు చేస్తున్నారు.
నాగార్జునసాగర్కి పర్యాటకుల రద్దీ పెరిగింది. ఆదివారం సెలవు కావడంతో ప్రజలు భారీగా తరలి వస్తున్నారు. దీంతో 3 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. ప్రజలు నాగార్జునసాగర్ వద్దకు భారీగా తరలి వస్తున్న పోలీసులు మాత్రం కనీస భద్రత చర్యలు పాటించడం లేదు.
సుంకిశాల ప్రాజెక్టు కూలడానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతే కారణం అని మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు ఆరోపించారు. శుక్రవారం నాడు తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మరో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి శుక్రవారం నాడు ..
ఇచ్చిన మాట ప్రకారం రైతులకు రుణమాఫీ చేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు. రూ.లక్ష లోపు రుణం తీసుకున్న అందరికి మాఫీ అయ్యిందని వివరించారు. రెండో దఫాలో రూ.2 లక్షల వరకు లోన్ తీసుకున్న వారికి మాఫీ అవుతుందని తేల్చి చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల కోసం పనిచేస్తోందని వెల్లడించారు. రైతుల మేలు కోరి రుణమాఫీ చేస్తున్నామని చెప్పుకొచ్చారు.
నల్లగొండ జిల్లా డిండి మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో 16 మంది విద్యార్థినులను ఎలుకలు గాయపర్చాయి. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
యాదాద్రి థర్మల్ విద్యుత్కేంద్రం నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి.
యాదాద్రి విద్యుత్ ప్లాంట్ విషయంలో చేస్తున్న వాదనలో సహేతుకత లేదని మాజీమంత్రి జగదీష్ రెడ్డి (Jagadish Reddy) తెలిపారు. గత ప్రభుత్వంలో జరిగిన ఒప్పందాలపై ఎల్ నరసింహ రెడ్డి కమిషన్ సమాచారం కోరిందని, ఈ రోజు రిప్లై పంపించినట్లు చెప్పారు.