Home » Nalgonda
వర్షాకాలం వచ్చిందంటే చాలు సాధారణంగానే సీజనల్ వ్యాధులు ప్రబలుతాయి. ఈసారి మాత్రం పరిస్థితి ఘోరంగా ఉంది. తెలంగాణలో ఏ ఊరుకెళ్లినా.. ప్రజలు వైరల్ ఫీవర్‌తో మంచాన పడి కనిపిస్తున్నారు. ముఖ్యంగా నల్లగొండ జిల్లాలో పలు గ్రామాల్లో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో చెరువులు కబ్జా కోరల్లో చిక్కుకున్నాయి. జాతీయ రహదారుల వెంబడే కాకుండా ప్రధాన పట్టణాల్లోని చెరువులు కబ్జాకు గురయ్యాయి.
కన్న కొడుకులే వాళ్ల పాలిట కాలయములయ్యారు. తాగిన మైకంలో కసాయిల్లాగా మారారు. ఒకడు తల్లి గొంతు కోసి అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. ఆ తరువాత అదే కత్తితో తనూ గొంతు కోసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
నిండు గర్భిణి పట్ల ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్, నర్సులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఆమె కూర్చున్న కుర్చీలోనే ప్రసవించింది. ఈ దారుణం నల్లగొండ జిల్లా ప్రభుత్వాస్పత్రిలో చోటు చేసుకుంది.
నల్లగొండ జిల్లాలోని కొర్లపహాడ్ టోల్‌ప్లాజా వద్ద ట్రామా కేర్ సెంటర్ ఏర్పాటు అర్ధాంతరంగా నిలిచిపోయింది. జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ) మోకాలడ్డడంతో నిర్మాణ సంస్థ ఆటోమెటిక్ డేటా ప్రాసెస్ (ఏడీపీ) పనులను నిలిపేసింది.
Telangana: సీఎం రేవంత్ రెడ్డి నిజస్వరూపం బయట పడిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు వ్యాఖ్యలు చేశారు. గురువారం ఏబీఎన్-ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ... జనగామకు వచ్చి కొమురవెల్లి మల్లన్న మీద ఓట్టు వేసి ఆగస్టు 15 వరకు రైతులకు రుణమాఫీ చేస్తా అన్నాడు... ఏ ఊర్లో అయినా వంద శాతం రుణమాఫీ అయ్యిందా? ఇంకా 22 లక్షల మందికి రుణమాఫీ కాలేదు’’ అని చెప్పారు.
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో బుధవారం కుక్కలు పెట్రేగిపోయాయి. నల్లగొండ జిల్లాలో ఓ పిచ్చికుక్క ఇంటి ముందు ఆడుకుంటున్న బాలుడు సహా ఐదుగురిపై దాడిచేసి తీవ్రంగా గాయపరచగా, మహబూబాబాద్ జిల్లాలో కుక్క దాడిలో తండ్రీ, కొడుకులు గాయపడ్డారు.
ఆన్లైన్ బెట్టింగ్ కోసం చేసిన అప్పుల ఊబి నుంచి బయటపడలేక ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు.
ఆగస్టు 2న సుంకిశాల రిటైనింగ్ వాల్ కూలిన ఘటన తెలంగాణ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై పెద్ద రాజకీయ దుమారమే రేగుతోంది. అయితే తాజాగా ఘటన జరిగిన సుంకిశాల ప్రాంతాన్ని బీజేపీ ఎమ్మెల్యేల బృందం పరిశీలించింది. ఎమ్మెల్యేలు ఏలేటి మహేశ్వర్ రెడ్డి, పాల్వాయి హరీశ్ బాబు, రామారావు పటేల్, ఎమ్మెల్సీ ఎ.వి.ఎన్. రెడ్డి సహా స్థానిక బీజేపీ నాయకులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు.
గ్రీన్‌ఫీల్డ్ ఫార్మా క్లస్టర్ల ఏర్పాటు ప్రక్రియను సాధ్యమైనంత త్వరగా ప్రారంభించి, భూసేకరణ పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం అంతర్జాతీయ ఫార్మా కంపెనీలతో చర్చలు జరిపి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆహ్వానిస్తోంది.