Home » Nandyal
నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో నిర్వహించిన కిసాన్ మేళా కార్యక్రమం అనంతపురం. అన్నమయ్య, కర్నూల్, నంద్యాల జిల్లాలకు చెందిన రైతన్నలను ఆకర్షించింది.
ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా ఆదేశాల మేరకు జిల్లాలో రోడ్ల భద్రతా ప్రమాణాలు కచ్చితంగా పాటించేందుకు, రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని పోలీస్ అధికారులు తెలిపారు.
ఉపాధ్యాయుల శిక్షణా కార్యక్రమాలను వాయిదా వేయాలని ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రామచంద్రారెడ్డి, శివయ్య డీఈవో జనార్దన్‌రెడ్డిని కోరారు.
జిల్లాలో రోడ్డు ప్రమాదాలను అరికట్టడానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాజకుమారి అధికారులను ఆదేశించారు.
నందికొట్కూరు సబ్ జైలును జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకటశేషాద్రి, డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ శివరామచంద్ర రావు, జైలు విసిటింగ్ న్యాయవాది అరుణ్‌కుమార్, సబ్ జైలును సందర్శించారు.
మండలంలోని ఎం.తిమ్మాపురంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణలో ఎంపీహెచ్‌ఈవో ఉసేన్‌రెడ్డి అధ్యక్షతన సెమీ క్రిస్మస్ వేడుకలను వైధ్యాధికారి భగవాన్‌దాస్ ఆధ్వర్యంలో నిర్వహించారు.
పంజాబ్, హర్యానా సరిహద్దుల్లో రైతాంగం పండించిన అన్ని పంటలకు కనీస మద్దతు ధర సహా 11 డిమాండ్ల పరిష్కారం కోసం చేపట్టిన ఛలో ఢిల్లీ కార్యక్రమాన్ని హర్యానా పోలీసులు మూడోసారి అడ్డుకున్నారని, వారిపై భాష్పవాయువు ప్రయోగించడం అమానుషం అని అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వై.నరసింహులు అన్నారు.
మహానంది క్షేత్రంలో ఆదివారం వేలాదిమంది భక్తులు స్వామి,అమ్మవార్లను దర్శించు కున్నారు.
ఆంధ్రరాష్ట్ర సాధన కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసి, ప్రాణాలర్పించిన అమరజీవి పొట్టి శ్రీరాములు చేసిన సేవలు చిరస్మరణీయం అని నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్తా జయసూర్య అన్నారు.
ఆత్మకూరు మండలంలో మొత్తం 8 సాగునీటి సంఘాలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా 7 చోట్ల ఎన్నికలు ఏకగ్రీవం కాగా ఒకచోట ఓటరు జాబితా సక్రమంగా లేకపోవడంతో ఎన్నిక వాయిదాపడింది.