Home » Nara Lokesh
ఏపీ మంత్రి నారా లోకేశ్ నిర్వహిస్తున్న ప్రజా దర్బార్‌కు రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు పోటెత్తుతున్నారు. గుంటూరు జిల్లా ఉండవల్లి కరకట్ట నివాసం వద్ద ఈ ప్రజాదర్బార్ నిర్వహిస్తున్నారు. ప్రతి ఒక్కరి సమస్య వింటూ పరిష్కారం చేస్తానని ఆయన హామీ ఇస్తుండటంతో ప్రతి ఒక్కరూ తమ సమస్యలు విన్నవించేందుకు బారులు దీరుతున్నారు.
రెడ్‌బుక్‌లో ఇప్పటి వరకు రెండు చాప్టర్లను మాత్రమే తెరిచామని, మూడో చాప్టర్‌ను త్వరలోనే తెరుస్తామని మంత్రి నారా లోకేశ్ ప్రకటించారు.
ఏపీకి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా అమెరికాలో పర్యటించిన ఏపీ మంత్రి నారా లోకేశ్.. అక్కడి తెలుగు ఎన్నారైలపై ప్రశంసల జల్లు కురిపించారు. ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో రెండు లక్షల రూపాయలు ఖర్చుపెట్టి టిక్కెట్ కొనుక్కొని వచ్చి మరీ ఓటేశారని అభినందించారు.
ఏపీలో పెట్టుబడులే లక్ష్యంగా మంత్రి నారా లోకేష్ అమెరికా పర్యటన కొనసాగింది. వారం రోజుల్లో వివిధ సంస్థల ప్రతినిధులు, సీఈవోలు, ప్రెసిడెంట్స్, వైస్ ప్రెసిడెంట్లతో ఆయన భేటీ అయ్యారు. అమెరికాలో ప్రముఖ కంపెనీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా రాష్ట్రంలో పెట్టుబడులకు గల అవకాశాలను వివరించారు.
ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించారో వారికి కచ్చితంగా సినిమా చూపిస్తామని, గన్నవరం సభలో తాను కొన్ని హామీలు ఇచ్చానని.. అవి గుర్తున్నాయని, ఎలాంటి సందేహం అవసరం లేదని.. త్వరలోనే మూడో చాప్టర్ కూడా తెరుస్తానని మంత్రి లోకేష్ అన్నారు. అట్లాంటాలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు.
సేల్స్ ఫోర్స్ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్లలతో మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం స్టార్టప్, మ్యానుఫ్యాక్చరింగ్ హబ్‌గా అభివృద్ధి చెందుతోందని, ఏపీలో ఎఐ వర్సిటీ, డాటా సెంటర్లు రాబోతున్నాయని... పెట్టుబడులకు ఇదే సరైన సమయమని లోకేష్ వారికి వివరించారు. వారం రోజులుగా సంస్థల ప్రతినిధులు సీఈవోలు, వైస్ ప్రెసిడెంట్‌తో నారా లోకేష్ వరుస బేటీలు నిర్వహిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెటుబడులే లక్ష్యంగా మంత్రి నారా లోకేశ్.. యూఎస్‌లో పర్యటిస్తున్నారు. అందులోభాగంగా లాస్ వెగాస్‌లో ఐటీ సర్వ్ సినర్జీ సమ్మిట్‌లో మంత్రి లోకేశ్ విశిష్ట అతిథిగా పాల్గొన్నారు. ఈ సదస్సులో ఆయన కీలకోపన్యాసం చేయనున్నారు. అలాగే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు గల అవకాశాలను సైతం మంత్రి నారా లోకేశ్ ఈ సదస్సులో వివరించనున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిజిటల్ గవర్నెన్స్‌కు సాంకేతిక సహకారం అందించాలని మైక్రో సాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్లను మంత్రి నారా లోకేష్ కోరారు. అమరావతిని ఎఐ క్యాపిటల్‌గా తీర్చిదిద్దేందుకు సహకరించాలని, రాష్ట్రంలో ఐటి హబ్‌లకు సహకారం అందించాలని, ఒకసారి ఏపీని సందర్శించాల్సిందిగా సత్య నాదెళ్లను లోకేష్ ఆహ్వానించారు.
ఎలకా్ట్రనిక్ వెహికల్స్(ఈవీ) పరిశ్రమకు అనంతపురం జిల్లా వ్యూహాత్మక ప్రదేశమని, ఈ రంగంలో పెట్టుబడులు పెట్టాలని దిగ్గజ సంస్థ టెస్లాను ఐటీ, మానవవనరుల శాఖ మంత్రి లోకేశ్ ఆహ్వానించారు.
ఏపీ యువతకు రాబోయే ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలన్న లక్ష్యానికి అనుగుణంగా సీఎం చంద్రబాబు ఇటీవల ఆరు పాలసీలను ప్రకటించారని మంత్రి లోకేష్ తెలిపారు. ఇందులో భాగంగా అమెరికాలో పర్యటిస్తున్న ఆయన శాన్ఫ్రాన్సిస్కోలో భారత కాన్సులేట్ జనరల్ శ్రీకర్‌రెడ్డి ఆధ్వర్యాన పారిశ్రామికవేత్తలతో ఏర్పాటు చేసిన రౌండ్‌టేబుల్ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.