Home » Nara Lokesh
ఇంట్లో బాబాయ్‌ని చంపేసి పచ్చి నెత్తురు తాగే రాక్షసుడు మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి అని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సంచలన ఆరోపణలు చేశారు. ఈ మేరకు ఎక్స్ లో జగన్‌పై లోకేష్ తీవ్ర విమర్శలు గుప్పించారు.
రాష్ట్రంలో గ్రంథాలయ వ్యవస్థను బలోపేతం చేయనున్నట్టు ఐటీ, మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేశ్ చెప్పారు.
విశాఖపట్నంలో ప్రతిష్ఠాత్మక టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) సెంటర్ ఏర్పాటుకు వంద రోజుల్లోగా శంకుస్థాపన చేస్తామని మంత్రి నారా లోకేశ్ ప్రకటించారు.
సాక్షి మీడియా ఇప్పటికైనా వాస్తవాలు ప్రజలకు చెప్పాలని కోరుతున్నామని మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. సాక్షి పత్రిక 2019లో తన పైన తప్పుడు రాతలు రాశారని మండిపడ్డారు. రూ. 75 కోట్ల పరువు నష్టం దావా వేశానని అన్నారు. ప్రజలపై భారంపడేలా ప్రభుత్వ వాహనాలు.. ఎకామిడేషన్ గాని వినియోగించలేదని చెప్పారు.
నారా లోకేష్ శుక్రవారం విశాఖలో కోర్టుకు హాజరుకానున్నారు. ఇప్పటికే విశాఖ నగరానికి చేరుకున్న ఆయన పార్టీ కార్యాలయంలో బస చేశారు. ‘చినబాబు చిరుతిండి..25 లక్షలండి’ పేరుతో సాక్షిలో అసత్య కథనంపై లోకేష్ న్యాయ పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే.
నారా రోహిత్- సిరి నిశ్చితార్థ వేడుక హైటెక్స్ నోవాటెల్ హోటల్లో ఘనంగా జరిగింది. రోహిత్ పెద్ద నాన్న, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వేడుక పెద్దగా వ్యవహరించారు. నిశ్చితార్థ పనులను నారా భువనేశ్వరి దగ్గరుండి పర్యవేక్షించారు.
రాష్ట్ర పండుగగా వాల్మీకి జయంతిని నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 17న అన్ని జిల్లాల్లోనూ వాల్మీకి జయంతి అధికారికంగా నిర్వహించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. అనంతపురంలో రాష్ట్ర స్థాయి వాల్మీకి జయంతిని నిర్వహిస్తారు. ప్రభుత్వం తరఫున ముఖ్య అతిథిగా మంత్రి సవిత పాల్గొంటారు.
పది వేల మంది యువతకు ఉద్యోగావకాశాలు కల్పించే టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) ను విశాఖకు జగనే తీసుకొచ్చినట్లుగా ఆయన రోజూ రాత్రిపూట మాట్లాడుకునే ఆత్మ చెప్పిందేమోనని ఐటీ, మానవ వనరుల అభివృద్ధి మంత్రి లోకేశ్ ఎద్దేవాచేశారు.
తెలుగు ప్రజలందరికీ ఆంధ్రప్రదేశ్ మంత్రులు నారా లోకేశ్, టీజీ భరత్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దసరా శుభాకాంక్షలు తెలిపారు. మంచిపై చెడు గెలిచిన సందర్భంగా దసరా పండగ నిర్వహించుకుంటారని మంత్రి లోకేశ్ తెలిపారు.
రాష్ట్ర విభజనతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిపోయింది. అలాంటి వేళ.. 2014లో జరిగిన ఎన్నికల్లో రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం కొలువు తీరింది. దీంతో రాజధానిగా అమరావతి నిర్మాణం, ఆంధ్రుల జీవ నాడి పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి సీఎం చంద్రబాబు చర్యలు చేపట్టారు.