Home » Narendra Modi
మూడు రోజుల పర్యటనలో మోదీ విల్మింగ్టన్లో క్వాడ్ సదస్సులో బైడెన్‌తో సమావేశమవుతారు.
వికసిత్ భారత్ సంకల్పం సాకారం లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోదీ బలమైన పునాదులు వేస్తున్నారు. ఒక నిర్ణయాత్మక, మహా సంకల్ప సాధన కోసం మార్గనిర్దేశనం చేస్తున్నారు.
క్వాడ్ లీడర్స్ సమ్మిట్‌లో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ శనివారం మూడు రోజుల పర్యటనకు అమెరికా బయలుదేరారు. ఈ నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో 'సమ్మిట్ ఆఫ్ ది ఫ్యూచర్'లో ప్రసంగించంతోపాటు పలువురు నేతలతో భేటీ కానున్నారు.
10 ఏళ్ల తర్వాత జమ్మూ కశ్మీర్లో ముఖ్యమంత్రిని ఎన్నుకునేందుకు అక్కడి ప్రజలు ఓట్లు వేస్తున్నారు. ఏడు జిల్లాల్లో తొలి దశలో 24 స్థానాలకు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలోనే ప్రధాని మోదీ అక్కడి ఓటర్లను విజ్ఞప్తి చేస్తు ఓ ట్వీట్ చేశారు.
ఇవాళ (మంగళవారం) పుట్టిన రోజు జరుపుకుంటున్న ప్రధాని మోదీకి తెలుగు రాష్ట్రాల సీఎంలు నారా చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు.. ప్రధాని మంచి ఆరోగ్యంతో పాటు దేశ సేవలో దీర్ఘాయుష్షు పొందాలని ప్రార్థిస్తున్నానని అన్నారు.
మనసునిండా ద్వేషం నింపుకొన్న కొందరు భారత్, గుజరాత్ ప్రతిష్ఠకు భంగం కలిగించే ఏ అవకాశాన్నీ వదిలిపెట్టడం లేదని ప్రధాని మోదీ విమర్శించారు.
రేపు భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ పుట్టినరోజు సందర్భంగా అనేక మంది ఇప్పటి నుంచే ప్రత్యేకంగా విషెస్ తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ 13 ఏళ్ల బాలిక ప్రధాని మోదీ చిత్రాన్ని ప్రత్యేకంగా 800 కిలోల మిల్లెట్లతో రూపొందించి వినూత్నంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసింది. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
ఈరోజు 6 కొత్త వందేభారత్ రైళ్లను ప్రధాని మోదీ(narendra Modi) జెండా ఊపి ప్రారంభించారు. ఈ రైళ్ల నిర్వహణ వల్ల కనెక్టివిటీ, సురక్షిత ప్రయాణం, ప్రయాణికులకు సౌకర్యాలు పెరుగుతాయి. ఈ మేరకు రైల్వే మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కొత్త వందేభారత్ రైలు నిర్వహణతో వాటి సంఖ్య 54 నుంచి 60కి పెరుగుతుందని రైల్వే మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.
కలయా? నిజమా? అన్నంతగా జమ్మూకశ్మీర్‌లో పదేళ్లలో అద్భుత ప్రగతిని సాధించామని.. దీంతో ఈ ప్రాంతంలో ఉగ్రవాదం అంతిమ ఘడియల్లో ఉందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు.
బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడటమే కాంగ్రెస్ అతిపెద్ద లక్ష్యమని. ఇవాళ పరిస్థితి ఎంతవరకూ వచ్చిందంటే గణపతిని సైతం కటకాల వెనక్కి నెట్టే పరిస్థితి కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో చోటుచేసుకుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విమర్శించారు.