Home » Narendra Modi
ముంబై: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) గత ఏడాది అట్టహాసంగా ఆవిష్కరించిన ఛత్రపతి శివాజీ మహరాజ్ (Sivaji Maharaj) 35 అడుగుల ఎత్తైన విగ్రహం సోమవారంనాడు కుప్పకూలింది. మహారాష్ట్రలోని సింధుదుర్గ్ జిల్లా రాజ్‌కోట్ ఫోర్ట్‌లోని ఈ విగ్రహం మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో కూలిపోయినట్టు అధికారులు తెలిపారు.
కేంద్ర పాలిత ప్రాంతం లద్దాఖ్(Ladakh)కు సంబంధించి ప్రధాని మోదీ(PM Modi) ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆ ప్రాంతంలో కొత్తగా ఐదు జిల్లాలు ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. ఎక్స్(ట్విటర్) వేదికగా ప్రకటించారు. దీనికి సంబంధించిన కార్యచరణ త్వరలోనే ప్రారంభించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
ఉక్రెయిన్‌లో శాంతి స్థాపన లక్ష్యంగా రెండో విడత అంతర్జాతీయ శాంతి సదస్సుకు భారత్ ఆతిథ్యమివ్వాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ప్రతిపాదించారు.
ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి కేంద్రప్రభుత్వం ఏకీకృత పెన్షన్ స్కీమ్ పేరిట కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం ఉద్యోగులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందంటూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎక్స్‌లో ట్వీట్ చేశారు.
మహిళలపై పెరుగుతున్న నేరాలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కీలక ప్రకటన చేశారు. మహిళలపై నేరాలకు పాల్పడే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని, ఎట్టి పరిస్థితిల్లోనూ వారిని విడిచిపెట్టేది లేదని హెచ్చరించారు. మహారాష్ట్రలోని జలగావ్లో ఆదివారంనాడు జరిగిన 'లఖ్పతి దీదీ' కార్యక్రమంలో ప్రధాని పాల్గొన్నారు.
ఏకీకృత (యూనిఫైడ్) పింఛన్ పథకానికి కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. దీని వల్ల పదవీ విరమణ పొందే ఉద్యోగులకు ఇప్పుడు లభిస్తున్న ప్రయోజనాల కంటే.. ఏకీకృత పింఛన్ పథకం(యూపీఎస్)లో మరింత లబ్ధి చేకూరనుంది.
ప్రధాని మోదీ ఉక్రెయిన్ పర్యటన, ఆ దేశ అధ్యక్షుడు జెలెన్స్కీతో భేటీపై ప్రపంచ మీడియా సానుకూలంగా స్పందించింది. ‘యుద్ధంలో తలపడుతున్న ఇరు దేశాల మధ్య సమతూకంతో మోదీ వ్యవహరించారు’ అని న్యూయార్క్స్ టైమ్స్ పేర్కొంది.
దేశ వ్యాప్తంగా కులాల వారీగా జనాభా లెక్కల సేకరణ జరగాలని విపక్షనేత, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ శనివారం మరోసారి డిమాండ్ చేశారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పోలాండ్, ఉక్రెయిన్ దేశాల్లో చారిత్రక పర్యటన ముగించుకుని స్వదేశానికి చేరుకున్నారు. శనివారం ఉదయ ఢిల్లీలోని పాలం విమానాశ్రయంలో అడుగుపెట్టారు.
ప్రస్తుతం భారత ప్రధాని నరేంద్ర మోదీ(narendra modi) ఉక్రెయిన్(Ukraine) పర్యటనపై ప్రపంచ దేశాల దృష్టి పడింది. అసలేం జరుగుతుంది, ఏం చర్చిస్తున్నారనే అంశాలపై ఆసక్తిగా ఉన్నారు. అదే సమయంలో ప్రధాని మోదీ తన ఒకరోజు పర్యటన ముగించుకుని ఉక్రెయిన్ నుంచి తిరిగి వచ్చారు. ఆ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.