Home » Narendra Modi
ఉగ్రవాదంపై పోరాటానికి భారత్ కృతనిశ్చయాన్ని ఇలాంటి దుష్టశక్తుల పన్నాగాలు నీరుగార్చలేవని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. పహల్గాం ఉగ్రదాడిలో మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు.
సౌదీ అరేబియాతో చిరకాలంగా ఉన్న మైత్రీ బంధాన్ని సౌదీ పర్యటనకు ముందు ఒక ప్రకటనలో ప్రధానమంత్రి మోదీ గుర్తుచేసుకున్నారు. సౌదీ అరేబియాతో భారత్‌కు చిరకాల, చారిత్రక సంబంధాలున్నాయని, ఇటీవల కాలంలో ఈ సంబంధాలు మరింత ఊపందుకున్నాయని చెప్పారు.
భారత్‌లో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ పర్యటన హైలైట్‌గా నిలిచింది. మోదీతో సమావేశం, వాణిజ్య చర్చలు, కుటుంబానికి విందు, పిల్లలకు నెమలి ఈకలతో పలు ప్రత్యేక క్షణాలు చోటుచేసుకున్నాయి
ప్రజలే దేవుళ్లు అనే దృక్పథంతో పని చేయాలని సివిల్ సర్వీసెస్ అధికారులకు ప్రధాని మోదీ సూచించారు. అభివృద్ధి చిట్టచివరి వ్యక్తికీ చేరాలన్నదే లక్ష్యమన్నారు
Pop Francis Visit To India: 2016లో పోప్ ప్రాన్సిస్ మాట్లాడుతూ.. తాను ఇండియా వస్తానని అన్నారు. 2017లో ఆయన ఇండియాలో పర్యటించాల్సి ఉండింది. అయితే, అనుకోని కారణాల వల్ల ఆయన ఇండియాకు రాలేకపోయారు. చివరగా 1999లో పోప్ జాన్ పాల్ 2 ఇండియాలో పర్యటించారు. అప్పటి నుంచి పోప్ ఇండియాకు రాలేదు.
అమెరికా ఉపాధ్యక్షుడు కుటుంబ సమేతంగా నేడు భారత్‌కు రానున్నారు. గురువారం వరకూ భారత్‌లో పర్యటించనున్నారు. వాన్స్‌కు ఇది తొలి అధికారిక భారత్ పర్యటన. ఆయన టూర్ షెడ్యూల్ పూర్తి వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం.
ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా, చిరంజీవి తదితరులు ముఖ్యమంత్రి చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ఆయన చూపిస్తున్న కృషి, దార్శనికతకు ప్రశంసలు అందాయి
టెక్ ప్రపంచ దిగ్గజం ఎలాన్ మస్క్ ఎట్టకేలకు భారత పర్యటనకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే అనేక సార్లు వాయిదా పడిన మస్క్ పర్యటన ఈసారి ఖరారు కానున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా మస్క్ ప్రకటించడం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.
ప్రధాని మోదీ శుక్రవారం ఎలాన్ మస్క్‌తో ఫోన్‌లో మాట్లాడారు. టెక్నాలజీ, ఆవిష్కరణల రంగాల్లో భారత్-అమెరికా భాగస్వామ్యాలను పెంచుకోవాలని కోరారు
కర్ణాటక సీఎం, డిప్యూటీ సీఎంల మధ్య విభేదాలు మోదీకి అవకాశమవుతున్నాయని ఖర్గే హెచ్చరించారు ప్రధాని ప్రభుత్వాన్ని కూల్చేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొంటూ కాంగ్రెస్ నేతలు అప్రమత్తంగా ఉండాలన్నారు