Home » Narendra Modi
మాక్రాన్‌తో సంభాషణల వివరాలను సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో ప్రధాని మోదీ పంచుకున్నారు. అధ్యక్షుడు మాక్రాన్‌తో చక్కటి సంభాషణలు జరిగాయని, వివిధ రంగాల్లో ద్వైపాక్షిక సహకారంపై సమీక్షించామని చెప్పారు.
మోదీ తనకెప్పటికీ ఫ్రెండేనన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కామెంట్‌పై భారత ప్రధాని తాజాగా స్పందించారు. తనదీ ఇదే భావన అని అన్నారు. భారత్, అమెరికా మధ్య వ్యూహాత్మక, అభివృద్ధికారక భాగస్వామ్యం ఉందని ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ మధ్య జరిగిన భేటీ ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ఇదే సమయంలో చైనా విషయంలో భారత్ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
షాంగై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమిట్‌లో మోదీ, పుతిన్‌ల బంధం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. చిరకాల స్నేహితులు ఒకే చోట కలుసుకోగానే ఎంతో ఆప్యాయంగా పలకరించుకున్నారు.
పరస్పర విశ్వాసయం, గౌరవం, సహృదయతే భారత్ చైనా బంధంలో ముఖ్య భూమిక పోషిస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. చైనా అధ్యక్షుడు జెన్పింగ్తో సమావేశం సందర్భంగా ప్రధాని మోదీ ఈ కామెంట్స్ చేశారు.
ప్రధాని నరేంద్ర మోదీ టెలిఫోన్ ద్వారా జెలన్‌స్కీతో మాట్లాడారు. ఉక్రెయిన్, రష్యా యుద్ధం ప్రస్తావన తెచ్చారు. దేశంలోని పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు.
చైనాలో ప్రధాని పర్యటించడం ఏడేళ్ల తర్వాత ఇదే మొదటిసారి. చివరిసారిగా 2018లో ఆయన చైనాలో పర్యటించారు. 2020లో లద్దాఖ్ సరిహద్దుల్లో చైనా, భారత్ బలగాల మధ్య ఘర్షణల అనంతరం మోదీ చైనాలో పర్యటించడం కూడా ఇదే ప్రధమం.
జపాన్-భారత్ వార్షిక సమావేశంలో పాల్గొనేందుకు బయలుదేరిన ప్రధాని నరేంద్ర మోదీ టోక్యోకు చేరుకున్నారు. రెండు రోజుల పాటు ఆయన జపాన్‌లో పర్యటిస్తారు. ఈ సందర్భంగా ఇరు దేశాల వార్షిక సమావేశంలో జపాన్ ప్రధానితో కలిసి పాల్గొంటారు. సెమీ కండక్టర్, బుల్లెట్ రైళ్ల తయారీ తదితర అంశాలపై ఇరు దేశాల మధ్య ఒప్పందాలు కుదరనున్నాయి.
2018లో జరిగిన ఇన్‌ఫార్మల్ సమిట్‌కు మోదీ వెళ్లారు. వూహాన్‌లో చైనా అధ్యక్షుడితో భేటీ అయ్యారు. తర్వాతి కాలంలో రెండు దేశాల మధ్య సరిహద్దుల గొడవల వల్ల సంబంధాలు బాగా దెబ్బతిన్నాయి.
భారత ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకుంది. 2030 కామన్వెల్త్ గేమ్స్ నిర్వహణకు బిడ్ వేసే ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది.