Home » Narendra Modi
డిజిటల్ అరెస్టుల (Digital Arrest) పేరుతో అమాయకులను భయపెట్టి డబ్బులు వసూలు చేస్తున్న సైబర్ నేరగాళ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ ఇవాళ (ఆదివారం) ‘మన్ కీ బాత్' 115వ ఎపిసోడ్లో ప్రధాని నరేంద్ర మోదీ అప్రమత్తం చేసిన విషయం తెలిసిందే. డిజిటల్ అరెస్టులపై ప్రధాని చేసిన ప్రసంగంపై సీనియర్ ఐపీఎస్ అధికారి, టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ స్పందించారు.
డిజిటల్ సెక్యూరిటీ కోసం 3 జాగ్రత్తలు తీసుకోవాలని ప్రధాని తెలిపారు. ''ఆగండి, ఆలోచించండి, చర్య తీసుకోండి'' అనేవి మూడు స్టెప్స్ అని చెప్పారు. వీలుంటే స్క్రీన్ షాట్ తీసుకోండి, కాలర్ మాటలు రికార్డు చేయండి. ఏ ప్రభుత్వ సంస్థ కూడా ఫోన్లలో బెదిరించడం కానీ, డబ్బులు డిమాండ్ చేయడం కానీ ఉండదు.. అని ప్రధాని తెలిపారు.
మహారాష్ట్రలోని నాందేడ్ లోక్‌సభ నియోజకవర్గానికి జరిగే ఉప ఎన్నిక ప్రచారంలోనూ ఈ స్టార్ క్యాంపెయినర్లు పాల్గోనున్నారు. మహారాష్ట్రలోని 288 అసెంబ్లీ స్థానలకు ఒకే విడతలో నవంబర్ 20న పోలింగ్ జరుగనుండగా, నవంబర్ 23న ఫలితాలు వెలువడతాయి.
ఉక్రెయిన్, పశ్చిమాసియాలో ప్రస్తుత పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయని ప్రధాని మోదీ చెప్పారు. ఈ ప్రాంతాల్లో శాంతిని నెలకొల్పేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టేందుకు భారత్ సిద్ధంగా ఉందన్నారు.
బ్రిక్స్ 16వ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు రష్యా వెళ్లిన భారత్ ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జీ పింగ్ ద్వైపాక్షిక భేటీ అయ్యారు. 2019 తర్వాత ఇరుదేశాధినేతల మధ్య ఇదే తొలి ద్వైపాక్షిక సమావేశం కావడం గమనార్హం. ఇద్దరూ కీలకమైన వ్యాఖ్యలు చేశారు.
వాస్తవాధీన రేఖ వెంబడి 2000 నుంచి కొనసాగుతున్న ఉద్రిక్తతలకు ముగింపు పలుకుతూ సరిహద్దుల వద్ద గస్తీని పునరుద్ధరించేందుకు ఇటీవల ఇరుదేశాల మధ్య కీలక ఒప్పందం జరిగిన నేపథ్యంలో ఉభయనేతలు సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. గత ఐదేళ్లలో మోదీ-జిన్‌పింగ్ సమావేశం కావడం ఇదే మొదటిసారి.
ఉగ్రవాదం, ఉగ్రవాదులకు నిధుల సరఫరా అనేవి చాలా తీవ్రమైన సమస్యలు. వీటిని చాలా సమర్ధవంతంగా ఎదుర్కోవాలి. ఇందుకు అంతా కలిసికట్టుగా పనిచేయాలనిని మోదీ సూచించారు. ఈ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర నేరుగా ఏ దేశం పేరును ప్రస్తావించకపోయినప్పటికీ ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తున్న పాకిస్థాన్‌కు చైనా ఆర్థిక సహాయాన్ని ఎండగట్టారు.
రష్యాలోని కజాన్ నగరంలో జరుగుతున్న బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అక్కడికి వెళ్లారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్-రష్యా వివాదాన్ని శాంతియుతంగా పరిష్కరించేందుకు భారత్ సిద్ధంగా ఉందని ఆయన చెప్పారు.
భారతదేశ ఆకాంక్షలు నిజమయ్యేదాకా తమ ప్రభుత్వం కష్టపడి పనిచేస్తూనే ఉంటుందని, విశ్రాంతికి అవకాశమే లేదని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.
దేశంలో కుటుంబ వారసత్వ రాజకీయాలు ఉండడం మంచిది కాదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అందువల్ల రాజకీయ నేపథ్యంలేని కుటుంబాలకు చెందిన యువత రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు.