Home » National News
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. 2027 జనాభా లెక్కల ప్రక్రియకు రూ. 11,718 కోట్ల బడ్జెట్‌కు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా జనాభా, డెమోగ్రఫిక్ వివరాలు సేకరణకు సహాయపడుతుంది. ఇంకా..
తమిళనాడులోని కులశేఖరపట్టణంలో 2027 నుంచి రాకెట్ ప్రయోగాలు చేపడతామని ఇస్రో చైర్మన్ వి నారాయణన్ తెలిపారు.
ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి..
ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి..
ఒక వ్యక్తికి ఓటరుగా నమోదు చేసుకునే అర్హత లేకున్నప్పటికీ అతను ఓటరుగా నమోదు చేసుకుంటే అది ఓట్ చోరీ అవుతుందని, అనుచిత విధానాలతో ఎన్నికల్లో గెలిస్తే దానిని ఓట్ చోరీ అంటామని, ప్రజాతీర్పుకు భిన్నంగా ఒక వ్యక్తి అధికారాన్ని హస్తగతం చేసుకుంటే అది కూడా ఓట్ చోరీ అవుతుందని అమిత్‌షా చెప్పారు.
ఎన్డీయే విస్తృత ఎజెండా, ప్రస్తుత సమావేశాల్లో ప్రభుత్వ ఎజెండాపై ప్రధాని ఈ సమావేశంలో ఎంపీలతో ప్రస్తావిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రాల్లో ప్రస్తుతం జరుగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియ అంశం కూడా విందు సమావేశంలో ప్రస్తావనకు రావచ్చని తెలుస్తోంది.
పార్లమెంటులో చర్చ ఎన్నికల సంస్కరణలకు ఉద్దేశించినప్పటికీ విపక్షాలు కేవలం ఎస్ఐఆర్‌పైనే దృష్టిసారించాయని, గత నాలుగు నెలలుగా ఎస్ఐఆర్‌పై అబద్ధాలు చెబుతూ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నాయని అమిత్‌షా అన్నారు.
ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్‌లో పాల్గొనేందుకు రాహుల్ గాంధీ డిసెంబర్ 15 నుంచి 20 వరకూ బెర్లిన్‌లో పర్యటించనున్నారు. మరోవైపు ప్రస్తుత పార్లమెంటు సమావేశాలు డిసెంబర్ 19తో ముగియనున్నాయి.
రాహుల్ గాంధీ పీఎంఓ కార్యాలయానికి ఒంటిగంట సమయానికి చేరుకున్నారు. 1.07 నిమిషాలకు సమావేశం ప్రారంభమైంది. సమావేశానంతరం అత్యున్నత పదవులకు మోదీ ప్రతిపాదించిన పేర్లతో విభేదిస్తున్నట్టు రాహుల్ పేర్కొంటూ లిఖితపూర్వకంగా తన అసమ్మతి నోట్‌ను అందజేశారు.
అగ్నిప్రమాదంలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న క్రిస్టినా బిజినెస్ వీసా కోసం దరఖాస్తు చేసుకున్నట్టు ఫారినర్స్ రీజినల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. అయితే వీసా ఇంకా అప్రూవ్ కాలేదని చెప్పారు.