Home » NCP
ముంబై: మహారాష్ట్ర లోక్‌సభ ఎన్నికల్లో (Lok Sabha Elections) అధికార కూటమి మధ్య సీట్ల పంపకాలపై బుధవారం ఏకాభిప్రాయం కుదిరింది. 48 లోక్‌సభ నియోజకవర్గాల్లో బీజేపీ 28 సీట్లలో పోటీ చేయంది. ఏక్‌నాథ్ షిండే సారథ్యంలోని శివసేన 15 సీట్లలో, ఎన్‌సీపీ (అజిత్ పవార్) 4 సీట్లతో పోటీ చేస్తున్నాయి.
ప్రధాని నరేంద్ర మోదీ( PM Modi ) పై ఎన్సీపీ అధినేత శరద్ పవార్ మరోసారి విరుచుకుపడ్డారు. ఈ లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ 400 కు పైగా సీట్లు కైవసం చేసుకుంటుందన్న ప్రధాని ప్రకటనను ఆయన ఖండించారు. సాగునీటి కుంభకోణానికి సంబంధించి ప్రధాని చేసిన ప్రకటనపైనా ఆయన మండిపడ్డారు.
రాజకీయ పార్టీలకు కేంద్ర ఎన్నికల సంఘం (Election Comission) షాక్ ఇచ్చింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏర్పాటు చేసే హోర్డింగ్స్ విషయంలో తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని సూచించింది.
లోక్‌సభ ఎన్నికలకు సమయం సమీపిస్తోంది. ఈ నేపథ్యంలో బీహార్, ఒడిశా రాష్ట్రాల్లోని లోక్‌సభ అభ్యర్థుల తుది ఎంపికపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దృష్టి సారించింది. ఆ క్రమంలో కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ (సీఈసీ) న్యూఢిల్లీలో సమావేశమైంది.
మహారాష్ట్రలో లోక్ సభ ఎన్నికలు రాజకీయ వేడి రాజేస్తున్నాయి. బీజేపీ మిత్రపక్షమైన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) బారామతి నియోజకవర్గం నుంచి మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ భార్య సునేత్రా పవార్‌ను పోటీకి దింపింది.
బారామతి లోక్ సభ నియోజకవర్గం శరద్ పవార్ కంచుకోట. 1967 నుంచి అసెంబ్లీ, లోక్ సభలో శరద్ పవార్ గెలుస్తున్నారు. బారామతి లోక్ సభ నుంచి 2009లో శరద్ పవార్ కూతురు సుప్రియ సూలే బరిలోకి దిగారు. అప్పటి నుంచి బారామతి నియోజకవర్గంలో వరసగా విజయం సాధిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో మాత్రం సుప్రియకు గట్టి పోటీ ఉండనుంది. బారామతి నుంచి ఎన్సీపీ తరఫున అజిత్ పవార్ సతీమణి సునేత్ర పవార్ బరిలో దిగారు.
బీజేపీ ఇతర పార్టీల నేతలను ప్రలోభాలకు గురి చేసి వారి పార్టీలోకి లాగుతుందని మాజీ సీఎం శరద్ పవార్ కుమార్తె, ఎంపీ సుప్రియా సులే ఆరోపించారు. ఆ పార్టీ ప్రలోభాలకు లొంగని వారిపై అక్రమ కేసులు పెట్టి జైల్లో వేస్తూ.. నీచ రాజకీయాలు చేస్తోందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
బీఆర్ఎస్ను కష్టాలు వీడటం లేదు. ఓ వైపు తెలంగాణలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు ఆ పార్టీని గుడ్‌బై చెబుతుంటే.. పక్క రాష్ట్రం మహారాష్ట్ర(Maharashtra)లోనూ బీఆర్ఎస్ నేతలు కారు దిగి వేరే పార్టీల్లో చేరుతున్నారు. లోక్‌సభ(Lok Sabha) ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో పోటీపై బీఆర్ఎస్ (BRS) అధిష్టానం క్లారిటీ ఇవ్వకపోవడంతో బీఆర్ఎస్ నేతలు ఎవరిదారి వారు చూసుకుంటున్నారు.
శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్‌సీపీకి ఎన్నికల సంఘం కొత్త ఎన్నికల గుర్తుగా 'మ్యాన్ బ్లోయింగ్ తుర్హా' ని కేటాయించింది. ఈ గుర్తుతోనే లోక్‌సభ ఎన్నికల్లో శరద్ పవార్ వర్గం పోటీ చేయనుంది.
రానున్న లోక్‌సభ ఎన్నికలు మహారాష్ట్రలో కీలకం కానున్నాయి. బారామతిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా మారనున్నాయి. ఈ ఎన్నికల్లో పవార్ కుటుంబం మధ్య హోరాహోరీ పోరు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.