Home » NDA Alliance
విశాఖపట్నం కేంద్రంగా ఏర్పాటుచేయాల్సిన ‘దక్షిణ కోస్తా రైల్వే జోన్’పై (Visakha Railway Zone) కొన్నేళ్లుగా నెలకొన్న సస్పెన్స్‌కు ఆగస్ట్-19తో ఫుల్స్టాప్ పడింది. జోన్ ప్రకటించి ఏళ్లు గడుస్తున్నా పనులు ప్రారంభించకుండా కాలయాపన చేస్తోందన్న మాటలు ఇకపై వినపడవ్.. కనపడవ్!.
దేశ వ్యాప్తంగా రైళ్లలో నాసిరకం ఆహారాన్ని అందిస్తున్నారని కాంగ్రెస్.. ఎన్డీఏ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసింది. గడిచిన రెండేళ్లలో రైళ్లలో నాసిరకం ఆహార పదార్థాలు 500 శాతం పెరిగినట్లు RTI నివేదిక ఇచ్చింది.
విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికలో నిలబడటానికి కనీసం ఎన్టీఏ కూటమి నేతలకి అభ్యర్థి కూడా లేరని మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత అమర్నాథ్ విమర్శించారు. వారు భయపడే ఎమ్మెల్సీ ఎన్నికలు నుంచి తప్పుకున్నారని ఆరోపించారు.
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) బిజిబిజీగా గడుపుతున్నారు. ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో క్రికెట్ టీమ్‌కే పరిమితమైన వైసీపీ (YSR Congress).. విశాఖ స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచి సత్తా ఏంటో చూపించాలని విశ్వప్రయత్నాలే చేస్తోంది హైకమాండ్. అయితే.. నేతలంతా ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఆర్థికంగా, రాజకీయంగా అన్ని విధాలుగా బలమున్న..
ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల తర్వాత మరోసారి కూటమి వర్సెస్ వైసీపీ తలపడబోతున్నాయ్..! పరువు నిలబెట్టుకోవాలని వైఎస్ జగన్.. అసెంబ్లీలోనే కాదు.. ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ దెబ్బకొట్టి సత్తా ఏంటో చూపించాలని టీడీపీ చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తోంది...
విత్తనాల కోసం రైతులు తిప్పలు పడుతున్నారని.. క్యూలైన్లు కడుతుంటే ప్రభుత్వానికి కనిపించట్లేదా అని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) ఆరోపించారు. విత్తనాల కొరతపై వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు ఇచ్చిన వివరణ తలా తోక లేకుండా ఉందని విమర్శించారు. సాగర్ కుడికాలువ కింద రైతులకు విత్తన కొరత లేదని గుండె మీద చెయ్యి వేసుకుని చెప్పగలరా ? అని నిలదీశారు.
భారత మహిళా రెజ్లర్ వినేష్ ఫోగట్‌పై పారిస్ ఒలింపిక్స్‌లో అనర్హత వేటు పడటంపై దేశంలో రాజకీయ దుమారం చెలరేగుతోంది. ఈ విషయంపై కేంద్రప్రభుత్వాన్ని ఇండియా కూటమి పక్షాలు లక్ష్యంగా చేసుకున్నాయి. వినేష్ అనర్హతపై విపక్షాలు పార్లమెంట్లో ప్రభుత్వాన్ని ప్రశ్నించాయి.
ఆంధ్రప్రదేశ్‌లో కలెక్టర్ల కాన్ఫరెన్స్ ప్రారంభమైంది. ఈ సదస్సులో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. 97శాతం స్ట్రైకింగ్ రేట్‌తో ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిందన్నారు.
ఆంధ్రప్రదేశ్‌ను అన్నిరంగాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Nara Chandrababu Naidu) అగ్రగామిగా నిలపడానికి కృషి చేస్తున్నారని బీజేపీ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి (Kiran Kumar Reddy ) వ్యాఖ్యానించారు.
కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, సంక్షేమం కోసం కృషిచేస్తుందని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్(చిన్ని) (Kesineni Chinni) వ్యాఖ్యానించారు. కేవలం 40 రోజుల్లోనే అమరావతి నిర్మాణానికి రూ.15వేల కోట్లు కేంద్రం అందించిందని.. ఇది ముఖ్యమంత్రి చంద్రబాబు మార్క్ అని ఉద్ఘాటించారు.