Home » Nellore
Venkaiah Naidu: ప్రస్తుత పాలకులు శ్రీరాముడిని ఆదర్శంగా తీసుకుని సుపరిపాలన అందివ్వాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచించారు. ప్రజలు ప్రతిరోజూ రామాయణం, మహాభారతం చదవాలని వెంకయ్యనాయుడు చెప్పారు.
‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ నిర్వహించిన ‘అక్షరం అండగా.. పరిష్కారమే అజెండాగా’ కార్యక్రమం సౌత్‌మోపూరు గ్రామ అభివృద్ధికి ప్రేరణ ఇచ్చింది. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి గ్రామానికి రూ.1.20 కోట్లు మంజూరు చేసి, రోడ్ల, ప్రహరీ గోడల నిర్మాణం ప్రారంభించారు
Kakani Skipping Police Inquiry: పోలీసుల విచారణకు సహకరించకుండా హైడ్రామాకు తెరలేపారు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. మూడవ సారి కూడా పోలీసుల విచారణకు మాజీ మంత్రి గైర్హాజరయ్యారు.
అక్రమమైనింగ్ కేసులో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పోలీసుల విచారణకు రాకుండా హైడ్రామాకు తెరతీశారు. బుధవారం సాయంత్రం నెల్లూరుకు వస్తానని, గురువారం నుంచి అందుబాటులో ఉంటానంటూ పలువురికి ఫోన్లు చేస్తున్నాడు. కాగా అరెస్ట్ భయంతోనే కాకాణి హైడ్రామాకు తెరతీశారనే చర్చలు జరుగుతున్నాయి.
Kakani Investigation News: మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి రెండో రోజు విచారణకు డుమ్మా కొట్టారు. గురువారం నుంచి అందుబాటులో ఉంటానంటూ పోలీసులకు సమాచారం ఇచ్చారు మాజీ మంత్రి.
Kakani Police Notice: కాకాణి గోవర్థన్ రెడ్డికి పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశారు. ఈసారి విచారణకు రాకపోతే చర్యలు తప్పవని పోలీసు అధికారులు హెచ్చరించారు.
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఇంటికి పోలీసులు వెళ్లారు. క్వార్ట్జ్ అక్రమాలు, భారీ పేలుడు పదార్ధాల వినియోగం, రవాణా కేసులో నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు వెళ్లారు. పోలీసులు వస్తున్నారన్న విషయం ముందుగా తెలుసుకున్న కాకాణి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. అతనికి చెందిన రెండు ఇళ్లకు తాళాలు వేసి ఉన్నాయి. రెండు ఇళ్లలో ఎవరూ లేకపోవడంతో పోలీసులు ఆశ్చర్యపోయారు.
ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 609 అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. స్కూటర్‌పై ప్రయాణించి, ఆకస్మికంగా పనుల పరిశీలన చేపడుతున్నారు.
చర్లపల్లి - కన్నియాకుమారి మధ్య వేసవి ప్రత్యేక రైళ్లను నడిపేందుకు రైల్వేశాఖ ఏర్పాట్లు చేసింది. ఈమేరకు ఆ రైళ్ల వివరాలను దక్షిణ రైల్వే వెల్లడించింది. ప్రధానంగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రస్తుత వేసవిలో ఈ రైళ్లు ఎంతో ఉపయోగకరంగా మారనున్నాయి.
నెల్లూరు జీఆర్పీ సీఐ భుజంగరావుపై అవినీతి ఆరోపణలు నిర్ణారణ కావడంతో పోలీస్ ఉన్నతాధికారులు అతనిని వీఆర్‌కు పంపుతూ ఆదేశాలు జారీ చేశారు. సీఐ అక్రమాలపై గతంలో ఆధారాలతో సహా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కథనం ప్రసారం చేసింది. ఏబీఎన్ కథనంపై స్పందించిన ఉన్నతాధికారులు.. విచారణ చేపట్టారు.